నాకు పబ్బు లేదు, సంయమనం పాటించండి: హీరో తరుణ్
తనకు పబ్బు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని టాలీవుడ్ హీరో తరుణ్ తెలిపారు. ఏడేళ్ల క్రితం తాను ఓ పబ్‌లో భాగస్వామిగా మాత్రమే ఉండేవాడినని చెప్పారు. ఆరేళ్ల క్రితమే తాను ఆ పబ్ నుంచి పార్ట్
హైదరాబాద్: తనకు పబ్బు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని టాలీవుడ్ హీరో తరుణ్ తెలిపారు. ఏడేళ్ల క్రితం తాను ఓ పబ్‌లో భాగస్వామిగా మాత్రమే ఉండేవాడినని చెప్పారు. ఆరేళ్ల క్రితమే తాను ఆ పబ్ నుంచి పార్ట్‌నర్‌షిప్ వదులుకున్నాని ఆయన తెలిపారు. సిట్ ముందు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు.

సంబంధం లేదు..
సిట్ అధికారుల విచారణకు సహకరిస్తానని ఆయన తెలిపారు. డ్రగ్స్ మాఫియాతో తనకు సంబంధం లేదని తరుణ్ స్పష్టం చేశారు. సిట్ విచారణ అనంతరం తాను అన్ని వివరాలు చెబుతానని తరుణ్ చెప్పారు.

సంయమనం పాటించండి..
దయచేసి సంయమనం పాటించాలని ఆయన కోరారు. నా నిజాయితీని సిట్ ముందు నిరూపించుకుంటానని తరుణ్ తెలిపారు. డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న నేపథ్యంలో ఆయన శనివారం ఉదయం సిట్ విచారణకు హాజరయ్యారు. 2009లో ఆన్ అనే పబ్బును ప్రారంభించారు తరుణ్.
Recommended Video


కీలక సమాచారం రాబట్టే అవకాశం
కాగా, ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజులను విచారించిన సిట్ అధికారులు శనివారం తరుణ్‌ను విచారిస్తున్నారు. శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తరుణ్ నుంచి కూడా కేసు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంది.

ఏం చెబుతారో..
సిట్ విచారణలో తరుణ్ ఏం చెబుతారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజులు డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక సమాచారం ఇచ్చినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో తరుణ్ ఏం చెబుతారనేది ఉత్కంఠకు గురిచేస్తోంది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications