అవును, వైఎస్ జగన్ ను కలిశాను, రాజకీయాలు నాకు సరిపోవు: సినీ నటి రాశి
తాను ఇటీవల కాలంలో వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ ను కలిసినట్టు సినీ నటి రాశి చెప్పారు.అయితే తమ మద్య సమావేశంలో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని ఆమె చెప్పారు.
హైదరాబాద్:తాను ఇటీవల కాలంలో వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ ను కలిసినట్టు సినీ నటి రాశి చెప్పారు.అయితే తమ మద్య సమావేశంలో ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని ఆమె చెప్పారు.
సినిమాల విషయమై చర్చించినట్టుగా ఆమె చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ ను కూడ తాను కలిసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అయితే రాజకీయాల్లోకి వచ్చాక పవన్ మారిపోయాడని చెప్పారు.

అయితే పవన్ కళ్యాణ్ మనస్తత్వం మాత్రం చాలా మంచిదని ఆమె చెప్పారు. ఆయన చాలా సున్నిత మనస్సున్న వ్యక్తిగా ఆమె చెప్పారు.
మరో వైపు తనను రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ కోరాడని ఆమె గుర్తుచేశారు.అయితే తనకు రాజకీయాలు సరిపోవన్నారు.అందుకే పవన్ పిలిచినా, తాను మాత్రం ఏ విషయం చెప్పలేదన్నారు సినీనటి రాశి.












Click it and Unblock the Notifications