ట్విట్టర్ సీఈవో కుర్చీలో కుక్క: నా బ్యాడ్జ్ ఆలస్యమేనంటూ ఎలాన్ మస్క్ ట్వీట్‌పై కేటీఆర్
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్‌పై సెటైరికల్ ట్వీట్ చేశారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో ఒక ఫొటోను పోస్టు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్‌పై సెటైరికల్ ట్వీట్ చేశారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో ఒక ఫొటోను పోస్టు చేశారు. ట్విట్టర్ సీఈవో పోస్టును ఓ కుక్కకు అప్పగించినట్లు కార్యాలయంలోని కుర్చీలో కుక్క ఉన్న ఫొటోను ఎలాన్ మస్క్ పోస్టు చేశారు.

నా బ్లూ బ్యాడ్జ్ ఆలస్యమే: ఎలాన్ మస్క్ ట్వీట్‌పై కేటీఆర్ సెటైర్
ట్విట్టర్ న్యూ సీఈవో ఏమేజింగ్ అంటూ పేర్కొన్నారు ఎలాన్ మస్క్. ఇతర వ్యక్తుల కంటే ఇదే బెటర్ అని వ్యాఖ్యానించారు. దీనికి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. నా ధృవీకరణ బ్యాడ్జ్‌ని పొందడానికి చాలా సమయం పట్టడంలో ఆశ్చర్యం లేదు అంటూ కేటీఆర్ మస్క్ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఇక తన ఖాతాకు బ్లూ టిక్ ధృవీకరణ ఇప్పుడే వస్తుందో రాదో అన్నట్లు కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ట్విట్టర్ ఖాతా బ్లూ టిక్ తొలగింపు..
కాగా, తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ట్విట్టర్ ఖాతా నుంచి ఉన్నట్టుండి ఇటీవల వెరీఫైడ్ ట్యాగ్ తొలగించారు. ఏం జరిగిందో తెలియదు కానీ, కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్‌కు మాత్రం గత కొద్ది రోజులుగా బ్లూ టిక్ మిస్సయింది. దీంతో కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ నాన్ వెరీఫైడ్ గానే చూపిస్తోంది. అయితే, ట్విట్టర్ యూజర్లకు వెరీఫైడ్ టిక్ ను ఎలాన్ మస్క్ పెయిడ్ సర్వీసుగా మార్చిన విషయం తెలిసిందే.
కేటీఆర్ సార్! ప్రపంచమే గుర్తించింది.. ట్విట్టర్ బ్యాడ్జ్‌తో పనేంటి?
ప్రస్తుతం మంత్రి కేటీఆర్‌ను 3.8 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఆయన మాత్రం 161 మందిని ఫాలో అవుతున్నారు. అయితే, ఇప్పటి వరకు ఉన్న బ్లూటిక్ ఇప్పుడు తొలగించడంతో నెటిజన్లలో కూడా కొంత గందరగోళం నెలకొంది. ఈ ట్విట్టర్ ఖాతా మంత్రి కేటీఆర్‌దేనా? అనే సందేహం వస్తోంది.కేటీఆర్ తాజా ట్వీట్‌పై కొందరు నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. తమ పరిస్థితి కూడా అలాగే ఉందని కొందరు వ్యాఖ్యానించారు. కేటీఆర్ సార్ మీరు ప్రపంచం గుర్తింపు పొందారు.. ట్విట్టర్ టిక్ లేకపోయినా పర్లేదు అని కొందరు పేర్కొంటున్నారు. .












Click it and Unblock the Notifications