బాహుబలి2 చూడాలి! లీవ్ ఇవ్వండి!!: సోషల్ మీడియాలో కానిస్టేబుల్ లెటర్ హల్‌చల్
బాహుబలి టికెట్ల కోసం సినీ అభిమానులు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండకు చెందిన ఓ కానిస్టేబుల్ రాసిన ఒక లీవ్‌లెటర్ వాట్సప్‌లో చక్కర్లు కొడుతోంది.
వరంగల్): ఏప్రిల్ 28న విడుదల కానున్న 'బాహుబలి-2' మేనియాపై అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా అదే చర్చ. ఇప్పటికే వారం రోజుల టికెట్లు అమ్ముడైపోవడం విశేషం. అంతేగాక, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 8వేలకు పైగా థియేటర్లలో విడుదలవుతోంది.
బాహుబలి టికెట్ల కోసం సినీ అభిమానులు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండకు చెందిన ఓ కానిస్టేబుల్ రాసిన ఒక లీవ్‌లెటర్ వాట్సప్, ఇతర సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది.

'నా పేరు విజయ్‌కుమార్, మీ స్టేషన్‌లో కానిస్టేబుల్ని. రెండేళ్ల క్రితం బాహుబలి సినిమా చూసినప్పటి నుంచీ నాకు డ్యూటీ మీద ఏకాగ్రత కుదరట్లేదు. కారణం.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి 28న నేను బాహుబలి-2 సినిమాకు వెళ్లాలనుకుంటున్నాను. నాకు ఆ రోజు క్యాజువల్ లీవ్ మంజూరు చేయండి' అని ఆ కానిస్టేబుల్ చెప్పినట్లు ఉంది.
అయితే, ఇది ఎంతవరకు వాస్తవమో కానీ, బాహుబలి చిత్రంపై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. బాహుబలి చూసిన ప్రతీ ఒక్కరూ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం తెలుసుకునేందుకైనా బాహుబలి 2 చూడకతప్పేలా లేదు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications