జైలుకెళ్లేందుకు సిద్ధం, తగిన ఏర్పాట్లు చేయండి: పవన్ కళ్యాణ్ ట్వీట్

హైదరాబాద్: తన పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన అంశంపై జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం స్పందించారు. తాను మాట్లాడిన మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కొందరు ఫిర్యాదు చేశారని, దానిపై తాను మాట్లాడుతున్నానని పవన్ మూడు ట్వీట్లు చేశారు.

తాను జైలుకైనా, కోర్టుకైనా వెళ్లేందుకు సంతోషమేనని పవన్ ట్వీట్ చేశారు. అందుకు తగిన ఏర్పాట్లు త్వరగా చేస్తే మంచిదని సూచించారు. జనం కోసం జైలుకైనా, ఎక్కడికైనా వెళ్లేందుకు తాను సిద్ధమన్నారు.

 'I will be very happy to go to Jail n facing Courts and please kindly do the needful.'

మొదటి ట్వీట్ పైన క్లారిటీ ఇచ్చేందుకు మరో ట్వీట్ చేశారు. తొలుత తాను చేసిన ట్వీట్.. తన పైన కొందరు చేసిన ఫిర్యాదు పైన స్పందించానని పేర్కొన్నారు. తాను మాట్లాడిన మాటలకు తన పైన ఫిర్యాదు చేశారని, దానిని ఉద్దేశించి మాట్లాడానని చెప్పారు.

కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ పైన వ్యాఖ్యానించారని, రెచ్చగొట్టేలా మాట్లాడారని కొందరు న్యాయవాదులు హైదరాబాదులోని జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు, టీడీపీ నేతల పైన వ్యాఖ్యానించినందుకు కూడా కొందరు కేసులు పెడుతామని చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ ఘాటైన ట్వీట్ చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+