కేసీఆర్‌తో చేతులు కలిపేది లేదు: ఆశల్లేవని కోమటిరెడ్డి
నల్గొండ: తనకు పదవులపై ఎలాంటి ఆశలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. టిఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా కోమటిరెడ్డి కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరవచ్చనే ఊహాగానాలు జోరుగా వచ్చాయి.
వీటిపై కోమటిరెడ్డి స్పందిస్తూ.. తనకు పదవులు, అధికారం ముఖ్యం కాదని.. రైతులు, ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు. గత కొంత కాలంగా తాను టిఆర్ఎస్ పార్టీలో చేరుతానని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరేది లేదని, కేసీఆర్‌తో కలిసేది లేదని తేల్చి చెప్పారు. తన వెన్నంటి నడిచే కార్యకర్తలదీ ఇదే అభిప్రాయమని అన్నారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ప్రజలే తనకు అధిష్ఠానం ఎమ్మెల్యే కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లెంలో పథకాలను పూర్తి చేసేందుకు పోరాటం సాగించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యాల్లో ఒకటని కోమటిరెడ్డి చెప్పారు.
చిన్న రాష్ట్రాల స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ : కోదండరాం
హైదరాబాద్: చిన్న రాష్ట్రాల స్పూర్తి ప్రదాత అంబేద్కర్ అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అంబేద్కర్ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యిందని తెలిపారు. అంబేద్కర్ సూత్రాలే తమ కార్యాచరణకు మూలమని తెలిపారు. తెలంగాణ వనరులు అందరికీ అందాలని కోదండరాం ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications