నా అసెంబ్లీ సీటు వదులుకుంటా: మహిళా బిల్లుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: మహిళా బిల్లుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలుక చేషశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తుట్లు తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా కోటాలో తన సీటు వదులుకోవడానికి కూడా సిద్ధమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అంతర్జాతీయ టెక్‌పార్క్‌ను బుధవారం కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మన జీవితాలు చాలా చిన్నవని.. తన పాత్ర తాను పోషించానని అన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని తెలిపారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే స్థాయికి హైదరాబాద్ మహానగరం చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు.

దేశంలో 40 శాతానికి పైగా ఫార్మారంగ ఉత్పత్తులు ఇక్కడి నుంచే వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. పెట్టుబడులతో ముందుకొచ్చే కంపెనీలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లైఫ్‌సైన్సెస్ హబ్‌గా మారుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ చాలా అందమైన నగరమని.. ఇక్కడ ప్రతిభకు కొరత లేదన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఖర్చు కూడా తక్కువేనని మంత్రి కేటీఆర్ వివరించారు.
మహిళా బిల్లుపై పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమల్లోకి తీసుకురావాలని పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో ఇప్పటి వరకు అయిదు సార్లు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినట్లు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం ఆయన లోక్‌సభలో మాట్లాడారు. గతంలో దేవగౌడ, వాజ్‌పేయి ప్రధానులుగా ఉన్న సమయంలో, 13వ లోక్‌సభలో మహిళా బిల్లును ప్రవేశపెట్టారని, 15వ రాజ్యసభలో ఆ బిల్లు పాసైందని, ఇప్పుడు అయిదోసారి లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని, ఇది మా పార్టీ విధాన నిర్ణయమన్నారు ఎంపీ నామా. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత.. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 12 రోజుల్లోనే లెజిస్టేటివ్ అసెంబ్లీలో 33 శాతం రిజర్వేషన్ మహిళలకు కల్పించేందుకు తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు. మహిళల సంక్షేమం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
సర్పంచ్, జెడ్సీసీ, ఎంపీటీసీల్లో.. మహిళలకు తమ ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తోందని వివరించారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీల్లోనూ తెలంగాణ సర్కార్ మహిళలకు రిజర్వేషన్ ఇచ్చినట్లు ఎంపీ నామా తెలిపారు. తక్షణమే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని ఎంపీ నామా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications