ప్రతిరోజూ డ్రగ్స్ తీసుకొంటా, సెల్‌ఫోన్ కోడ్ మర్చిపోయా: కమింగ
నెదర్లాండ్స్‌కు చెందిన మైక్ కమింగ పోలీసుల విచారణకు సహకరించలేదని తెలిసింది. డ్రగ్స్ కేసులో ఆయనను పోలీసులు విచారించారు. అయితే ఈ కేసు విషయమై ఆయన నోరు విప్పలేదని తెలుస్తోంది. ఈ కేసు నుండి బయటపడేందుకుగాన
హైదరాబాద్: నెదర్లాండ్స్‌కు చెందిన మైక్ కమింగ పోలీసుల విచారణకు సహకరించలేదని తెలిసింది. డ్రగ్స్ కేసులో ఆయనను పోలీసులు విచారించారు. అయితే ఈ కేసు విషయమై ఆయన నోరు విప్పలేదని తెలుస్తోంది. ఈ కేసు నుండి బయటపడేందుకుగాను ఆయన వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
సినీ పరిశ్రమతో మైక్ కమింగకు సంబంధాలున్నాయి. అయితే నెదర్లాండ్స్ నుండే పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి అవుతున్నట్టుగా సిట్ అధికారులు గుర్తించారు.
ఈ కేసులో మైక్ కమింగ ఇచ్చే ఆధారాలు కీలకంగా మారనున్నాయి. దాదాపుగా 12 ఏళ్ళుగా కమింగకు సినీ పరిశ్రమతో సంబంధాలున్నాయి. మరోక సంస్థతో కలిసి ఆయన డిజిటల్ సపోర్ట్ టాలీవుడ్ పరిశ్రమకు అందిస్తున్నారు.
సిట్ అధికారుల విచారణ సమయంలోనే కమింగ పేరు వెలుగులోకి వచ్చింది. ఛార్మిని విచారిస్తున్న రోజునే కమింగను సిట్ అధికారులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications