Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేను కూడా బిజెపికి ఓటు వేస్తా: షరతు పెట్టిన కవిత, బాబుకు చురక

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపి నేతలు తెలంగాణకు రూ.20వేల కోట్ల ప్యాకేజీ తీసుకు వస్తే నేను కూడా భారతీయ జనతా పార్టీకే ఓటు వేస్తానని చెప్పారు.

ఆమె ఖైరతాబాద్ నియోజకవర్గంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి, దత్తాత్రేయలకు ప్రధాని మోడీ వద్ద పలుకుబడి ఉంటే తెలంగాణకు రూ.20వేల కోట్ల ప్యాకేజీ తేవాలన్నారు.

ఆ ప్యాకేజీ తెస్తే కనుక నేను కూడా బిజెపికే ఓటు వేస్తానని చెప్పారు. పేదలు ఎక్కువగా ఉండేది ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే అని చెప్పారు. ఖైరతాబాదులో పేదల ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. హైటెక్ సిటీ కట్టారు కాని డ్రెయినేజీని మరిచిపోయారని టిడిపి అధినేత చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు.

I will vote BJP but one condition, says Kavitha

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మహిళా పక్షపాతి అని అందుకే గ్రేటర్ ఎన్నికల్లో 75 సీట్లు మహిళలకు కేటాయించారన్నారు. కెసిఆర్ భోళాశంకరుడు అని ప్రశంసించారు.

ప్రతిపక్ష నేతల ప్రలోభాలకు లొంగిపోవద్దు: కేటీఆర్

హైదరాబాద్ అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకు పోతోందని, ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.

సికింద్రాబాద్ అల్వాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, నాయిని నర్సింహా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు ప్రలోభ పెడతాయని, వాళ్ల మాటలకు లొంగిపోవద్దన్నారు. అల్వాల్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

అంతకుముందు సనత్‌నగర్ మోడల్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాజధాని హైదరాబాద్ నగరాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చి దిద్దుతామన్నారు. క్రీడలపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు.

క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేస్తున్నారన్నారు. రూ.5 కోట్లతో సనత్‌నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను అభివృద్ది చేస్తామన్నారు. నగరంలోని ప్లే గ్రౌండ్‌లను కాపాడుకుందామని, వాటిని కబ్జాలకు గురికాకుండా కాపాడి మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+