గుత్తా పోటీచేస్తే నల్గొండలో పోటీకి నేను రెఢీ: కోమటిరెడ్డి

నల్గొండలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతాయనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరె్డ్డి .

నల్గొండ: నల్గొండలో టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతాయనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత కోమటిరె్డ్డి వెంకట్‌రెడ్డి మరోసారి సంచలన ప్రకటన చేశారు.

నల్లగొండ పార్లమెంట్ స్థానానికి టిఆర్ఎస్ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి పోటీ చేస్తే ఆయనపై పోటీకి సిద్ధమని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తనకు టిక్కెట్టు ఇవ్వకపోయినా సరే, పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.

Iam ready to contest in Nalgonda Parliament segment, says Komatireddy Venkat Reddy

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశిస్తే నల్గొండ పార్లమెంట్ స్థానుండి పోటీ చేస్తామని చెప్పారు. నల్గొండ జిల్లాకు మెడికల్ కళాశాల కోసం తలపెట్టిన దీక్ష వాయిదా వేస్తున్నామని వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఎయిమ్స్, మెడికల్ కళాశాల కోసం పోరాడుతామని కోమటిరెడ్డి చెప్పారు.

రాష్ట్ర రైతు సమాఖ్య కన్వీనర్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమించాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. ఒకవేళ సుఖేందర్‌రెడ్డికి ఈ పదవిని కట్టబెడితే నల్గొండ ఎంపీ పదవికి రాజీనామా చేయించే అవకాశం ఉందని టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+