బాధ్యతలు ఇవ్వనందువల్లే అలా! కాంగ్రెస్ లోనే కొనసాగుతా : దానం

హైదరాబాద్ : కొన్ని నెలల క్రితం టీఆర్ఎస్ లో చేరడానికి సర్వం సిద్దం చేసుకుని.. రాత్రికి రాత్రి బెడిసికొట్టిన వ్యవహారంతో.. యూ టర్న్ తీసుకుని మళ్లీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు దానం నాగేందర్. అయితే మునుపటిలా క్రియాశీలకంగా కాకుండా.. అసలు కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన ఊసే లేకపోవడంతో.. అసలు ఆయన పార్టీలోనే ఉన్నారా అన్న అనుమానాలు లేవనెత్తిన వారు లేకపోలేదు.

ఈ నేపథ్యంలోనే.. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, అదే పార్టీలో కొనసాగుతానని మీడియా ముఖంగా స్పష్టం చేశారు దానం. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే వేచి చూసే ధోరణితో సంయమనం పాటిస్తున్నామని, త్వరలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమం ద్వారా జనంలోకి వెళ్తామని తెలిపారు.

Iam with congress only says Danam nagendar

గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతికి బాధ్యత వహిస్తూ.. పార్టీ గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, తనకు పార్టీలో ఎలాంటి ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పనందు వల్లే తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నానని చెప్పుకొచ్చారు దానం. ఒకవిధంగా.. దానంకు ప్రస్తుతం పాలిటిక్స్ రెండో ఇన్నింగ్స్ లాంటివేనని చెప్పుకోవాలి. మరి త్వరలోనే ప్రభుత్వంపై పోరుకు సిద్దమంటోన్న దానం.. టీఆర్ఎస్ దూకుడుకు ఎంతమేర కళ్లెం వేస్తారనేది వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+