దిగిరాని ఆర్టీసీ కార్మికులు, ఐఏఎస్ కమిటీతో చర్చలు విఫలం,

Recommended Video

    TSRTC Samme : ఆర్టీసీ కార్మిక సంఘాలతో విఫలమైన చర్చలు || Oneindia Telugu

    ఆర్టీసీ కార్మికులతో ఐఏఎస్ కమిటీ చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సమ్మేను కొనసాగించేందుకు కార్మిక సంఘాలు సన్నద్దమవుతున్నాయి. చర్చల్లో భాగంగా తమకు ఎలాంటీ నిర్ధిష్ట హామీ లేదని ఇవ్వలేదని ఆర్టీసీ ఐరాస నేత అశ్వథ్దామ రెడ్డి తెలిపారు. అయితే సమస్యల పరిష్కారానికి సీఎం కేసిఆర్ కమిటీని వేయడం స్వాగతిస్తున్నామని అన్నారు. గతంలో కూడ సమస్యల పరిష్కారానికి ఇలాంటీ కమిటీలు వేశారని, వాటిద్వార ఎలాంటీ ఉపయోగం జరగలేదని తెలిపారు. దీంతో సమ్మేను యథావిధిగా కొనసాగించేందుకే తాము కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు.

    ఆర్టీసీ ఐకాస చేపట్టిన సమ్మే నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేపట్టాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆర్టీసీ కార్మీకుల ఐకాసతో ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. సమావేశంలో భాగంగా కార్మీకుల డిమాండ్లపై కమిటీ సభ్యులు చర్చించారు. కార్మికుల డిమాండ్లను విన్న కమిటీ సభ్యులు, చర్చల సారంశాన్ని ప్రభుత్వానికి వివరిస్తామని ఐఏఎస్‌ల కమిటీ అధ్యక్షుడు సోమేష్ కుమార్ తెలిపారు. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. అయితే దసరా సీజన్ కావడంతో సమ్మేను వాయిదా వేయాలని కార్మికులను కోరినట్టు చెప్పారు. అవసరమైతే మళ్లి ఒకసారి కార్మీకులతో చర్చలు జరుపుతామని చెప్పారు. ఇక కార్మికులు ఇచ్చిన 26 డిమాండ్లపై చర్చించి ప్రుభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు.

    IAS committee has met with Telangana RTC unions

    ఆర్టీసీ కార్మికులు వివిధ డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చి, ఈ నెల 5వ తేదీ నుండి సమ్మెలోకి వెళ్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలోనే సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలోనే సమస్యల పరిష్కారానికి ఐఏఎస్‌ల కమిటీని వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగానే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామక్రిష్ణరావు, సునిల్ శర్మ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+