రేవంత్ టీంలోకి అమ్రపాలి - స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం..!!
ముఖ్యమంత్రి రేవంత్ తన టీం కూర్పు పైన కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గం ఏర్పాటు కావటంతో..ఇప్పుడు సీఎంఓలో అధికారుల ఎంపిక పైన ఫోకస్ చేసారు. సీఎంఓ ముఖ్యకార్యదర్శిగా శేషాద్రిని ఇప్పటికే రేవంత్ నియమించారు. ఇదే సమయంలో కేసీఆర్ కార్యాలయంలో కీలక అధికారిగా పని చేసిన స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న అమ్రపాలి సీఎంఓకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరటంతో కీలక పోస్టులో నియామకాలు కొనసాగుతున్నాయి. సీనియర్ మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించారు. కేసీఆర్ ప్రభుత్వం లో స్మితా కీలకంగా వ్యవహరించారు. సుదీర్ఘ కాలం కలెక్టర్గా.. అనేక శాఖలు పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉండేవారు. కేసీఆర్ కార్యాలయ కార్యదర్శిగా పని చేసారు. ఇరిగేషన్ శాఖను పర్యవేక్షించారు. మిషన్ కాకతీయ..మిషన్ భగీరధ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ప్రధాన భూమిక పోషించారు. ఇక..తెలంగాణలో ప్రభుత్వం మారిన తరువాత స్మితా ఇప్పటి వరకు కొత్త సీఎం రేవంత్ ను కలవలేదు. ఇదే సమయంలో కేంద్ర సర్వీసులకు దరఖాస్తు చేసారు.

Some pics remind us how far we have come..
— Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023
through the valleys and the summits. 23 years to this pic… a driven young lady who always walked her will!
Thanks to all your love ♥️,
ever ready for a new challenge. pic.twitter.com/xahFAszBYv
తాజాగా స్మితా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 23 ఏళ్లు తెలుగు రాష్ట్రాల్లో పని చేసానని..అభిమానం చూపించారని చెప్పుకొచ్చారు. కొత్త ఛాలెంజ్ కు సిద్దం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. స్మితా తాజా ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. స్మిత భర్త అకున్ సబర్వాల్ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఇక..ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న మరో మహిళా ఐఏఎస్ అమ్రపాలి తాజాగా సీఎం రేవంత్ ను కలిసారు. తిరిగి తెలంగాణలో సేవలకు అమ్రపాలి సిద్దమైనట్లు తెలుస్తోంది. అమ్రపాలి సేవలను సీఎంఓలో వినియోగించుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు స్మితా కేంద్ర సర్వీసులకు..అటు కేంద్ర సర్వీసుల్లో ఉన్న అమ్రపాలి రాష్ట్ర సర్వీసుల్లోకి రావటం పైన అధికారం వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications