స్మితా సబర్వాల్ పై వేటు, అక్కడే ట్విస్ట్- శాంతికుమారి నెక్స్ట్..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనా పరంగా అధికార యంత్రాంగంలో ప్రక్షాళన మొదలు పెట్టింది. కీలక శాఖల బాధ్యుల్లో మార్పులు చేసింది. సీఎంఓ అధికారుల్లోనూ మార్పులు జరిగాయి. కొత్త సీఎస్ గా రామకృష్ణారావు ను నియమించారు. ఈ ఏడాది ఆగస్టు వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోకి కొందరు అధికారులను ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు. తాజాగా స్మితా సబర్వాల్ కు ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు ఆసక్తి కరంగా మారాయి. ఇక, ప్రస్తుత సీఎస్ పదవి విరమణ తరువాత దక్కే ప్రాధాన్యత ఏంటి.
స్మితా పై వేటు వెనుక
తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. అందులో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌పై వేటు పడింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా.. మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహాలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఆర్థిక సంఘం(ఫైనాన్స్ కమిషన్) సభ్య కార్యదర్శిగా నియమించింది. స్మితా పైన తీసుకున్న నిర్ణయం వెనుక అనేక ఆసక్తి కర అంశాలు చర్చలోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె సర్కారుకు వ్యతిరేకంగా పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. ఆ వ్యవహారంలో వివరణ ఇవ్వాలంటూ గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు.

ప్రభుత్వ తాజా నిర్ణయం
అప్పటి నుంచే స్మిత బదిలీ తప్పనిసరి అనే ప్రచారం జరిగింది. తాజా నిర్ణయంతో సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీల బాధ్యత నుంచి స్మితా సబర్వాల్ ను తప్పించారు. ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉంటూ కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రె స్ ప్రభుత్వానికి స్మితా సబర్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఆ పోస్టును తాను రీపోస్టు చేసినట్లే 2 వేల మంది షేర్ చేసినట్లు పేర్కొన్నారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటారా, చట్టం అంద రికీ సమానమా..ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా అంటూ స్మిత ప్రశ్నించిన తీరు సంచలనంగా మారింది.
సీఎంఓలో మార్పులు
ఇక, ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయను న్నారు. ఆ స్థానంలో కొత్తగా రామకృష్ణారావు ను నియమించారు. అయితే.. శాంతి కుమారికి పదవీ విరమణ తరువాత ఆర్టీఐ చీఫ్ కమీషనర్ గా నియమిస్తారని భావించారు. తాజాగా చంద్రశేఖర రెడ్డి పేరు ఈ పదవి కోసం పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సీఎంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకంగా పరిశ్రమల పెట్టుబడుల సెల్'ను ఏర్పాటు చేసి, జయేశ్ రంజన్‌ను సీఈవోగా నియమించారు. ముఖ్యమంత్రికి కార్యదర్శులుగా, పలు శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తున్న అధికారులు బదిలీపై వెళ్లనున్నారు. ఈ రోజు లేదా రేపు సీఎంఓలోనూ మార్పులు - చేర్పులతో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications