శ్రీలక్ష్మి :నాపై కేసులను కొట్టివేయండి, ప్రభుత్వ నిర్ణయం మేరకే లీజులు.

తనపై సిబిఐ నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ నిర్ణయాల్లో భాగంగానే లీజులు మంజూరు చేసినట్టుగా ఆమె తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు.

హైదరాబాద్ :దాల్మియా సిమెంట్స్ కు సున్నపురాయి లీజు మంజూరు వ్యవహరంలో ఊహజనిత అంశాల ఆధారంగానే తనపై కేసులు నమోదయ్యాయని, ఈ కేసులను కొట్టివేయాలని ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి హైకోర్టును కోరింది.

దాల్మియా సిమొంట్స్ కు సున్నపురాయి లీజు మంజూరు వ్యవహరంలో ఊహజనిత అంశాల ఆధారంగానే సిబిఐ కేసు నమోదుచేసిందని ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి తరపు న్యాయమూర్తి వై.శ్రీనివాసమూర్తి హైకోర్టుకు చెప్పారు.

ias srilaxmi urged high court to revoke cases.

సిబిఐ అదికారులు నమోదుచేసిన కేసును కొట్టివేయాలని శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై గురువారం నాడు జస్టిస్ శివశంకర్ రావు విచారణ జరిపారు.

శ్రీలక్ష్మి తరపు న్యాయవాది శ్రీనివాసమూర్తి తన వాదనలను విన్పించారు. కిందిస్థాయి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఇచ్చే నివేదికల ఆధారంగానే లీజులు మంజూరు చేస్తారని, ఇందులో శ్రీలక్ష్మి ప్రమేయం లేదన్నారు.

ప్రభుత్వ నిర్ణయాల్లో భాగంగానే లీజు మంజూరు జరిగిందే కాని, ప్రాస్పెక్టివ్ లీజరు తొలుత జయ మినరల్స్ కు ఇచ్చారని, తర్వాత అది ఈశ్వర్ సిమెంట్స్ బదిలీ అయిందన్నారు.

ఈశ్వర్ సిమెంట్స్ , ఆ తర్వాత దాల్మియా సిమెంట్స్ లో విలీనం అయిందని శ్రీలక్ష్మి న్యాయవాది హైకోర్టులో వాదించారు. ఈ వాదనలను విన్న న్యాయమూర్తి ఈ నెల 6వ, తేదికి కేసును వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+