బీజేపీ నేతలకు దమ్ముంటే రేల్వే కోచ్ ఫ్యాక్టరీ తెప్పించండి : ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
బీజేపీకి చేతనైతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెప్పించడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు ఇది కర్ణాటక గుర్తుంచుకుంటే మంచిందని ఆయన హితవు పలికారు.రాజకీయ కుట్రలతో టిఆర్ఎస్ బలాన్ని నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడీయా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ క్యాడర్ లేని బీజేపీ కుట్రలకు తెరలేపుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ కుట్రలను ఎలా తిప్పికొట్టాలో టీఆర్ఎస్ అధినేత కేసిఆర్‌తో పాటు టీఆర్ఎస్ క్యాడర్‌కు తెలుసని ఆయన అన్నారు.బీజేపీ నాయకులు ముందుగా ఇది కర్ణాటక రాష్ట్రం కాదని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.తెలంగాణకు నెలకో మంత్రిని పంపిస్తానని చెబుతున్న అమిత్ మంత్రులు వచ్చే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎలాంటీ అభివృద్ది సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారో తెలుపాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలవగానే మొత్తం రాజకీయాలు తమకు అనుకూలంగా ఉన్నాయని గొప్పలు చెప్పిన వాళ్లు ఆ తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు ఆ పార్టీని ప్రజలు గుర్తించలేదని అన్నారు. ఏ పార్టీ ఎన్ని కుట్రుల చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం కేవలం టీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని ప్రజల్లో స్పష్టమైన విశ్వాసం ఉందని ఆయన పేర్కొంటూ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కుట్రలతో తెలంగాణను అభాసు పాలు చేస్తుంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications