ఎన్నికల హమీలను నేరవేర్చకపోతే చెప్పుతో కొట్టండి,
ఎన్నికల్లో వింతవింత ప్రచారాలు, వింతవింత వేశాలు,ఓట్లకోసం నానాతిప్పలు పడతారు అభ్యర్థులు, గెలిచినప్పుడు చూద్దాం లే అంటూ విచిత్ర వేశాలు వేస్తారు.
తాజాగా ఈ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గంలో స్వతంత్ర్య అభ్యర్థి వినూత్న ప్రచారం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ఆకుల హన్మాండ్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు.

చెప్పినవి చేయకపోతే చెప్పుతో కోట్టు
ఎన్నికల్లో నాయకులు అనేక వాగ్దానాలు ఇస్తున్నారని, గెలిచిన తర్వాత వాటిని నెరవేర్చడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, తను అలాంటి వ్యక్తిని కాదని, తనను ఎన్నికల్లో గెలిపిస్తే ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తానని స్పష్టంచేశారు. హామీలను నెరవేర్చకపోతే తనను చెప్పుతో కొట్టి, తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి సమర్పించాలని వింత ప్రచారం చేస్తూ సోమవారం నామినేషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. . ఈ సందర్భంగా వింత ప్లకార్డులు చేత పట్టుకొని ఆయన నామినేషన్ వేశారు.












Click it and Unblock the Notifications