రేవంత్ అనుకుంటే కేటీఆర్‌ను ఇప్పుడే అరెస్ట్ చేయొచ్చు.. కానీ క్షమించేస్తున్నాడు!
భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఫార్ములా ఈ రేసు కేసులో నిండా మునిగిపోయినట్లు తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థమవుతోంది. నిన్నటి వరకు ఇందులో ఏమీ జరగలేదని గగ్గోలు పెట్టారుకానీ ఈ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అనుమతిచ్చేసరికి బీఆర్ఎస్ శ్రేణులు సైలెంటయ్యారు. గవర్నర్ నుంచి ఎప్పుడైతే అనుమతి వచ్చిందో అప్పటి నుంచే కేటీఆర్ ను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని భావిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ ఆలోచనలో లేరు.
కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకున్నారు
రేవంత్ రెడ్డిన్ని ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్నిరకాలుగా కేసీఆర్, కేటీఆర్ ఇబ్బందులు పెట్టారు. జన్వాడ ఫాంహౌస్ మీద డ్రోన్ ఎగురవేసినందుకు దారుణంగా ప్రవర్తించారు. ఉగ్రవాదులను ఉంచే సెల్ లో పెట్టారు. రేవంత్ కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగినప్పుడల్లా ఏదో ఒక కేసును రేవంత్ పై బనాయించేవారు. కేసీఆర్, కేటీఆర్ రేవంత్ లో చంద్రబాబును చూసుకున్నారేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే చంద్రబాబుపై ఉన్న కక్షంతా రేవంత్ రెడ్డి రూపంలో తీర్చుకున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులే వ్యాఖ్యానించేవి. అర్థరాత్రి తలుపులు బద్ధలు కొట్టి బెడ్ రూంలోకి వచ్చి మరీ పోలీసులు రేవంత్ ను అరెస్ట్ చేశారు. కుమార్తె పెళ్లికి అనుమతివ్వకపోతే కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. ఇవన్నీ రేవంత్ కు గుర్తు లేవా? అంటే గుర్తున్నాయి.

కేటీఆర్ ఏం చేస్తారో చూద్దాం
గవర్నర్ అనుమతివ్వడంతో రేవంత్ ఈ క్షణమే కేటీఆర్ ను అరెస్ట్ చేయించొచ్చు. అయితే ఈ విషయంలో ఆయన ఎలాంటి తొందరపాటుతనానికి గురవడంలేదు. చిన్న వయసులోనే ఎంతో పరిణతి చెందిన అత్యంత సీనియర్ రాజకీయవేత్తలా వ్యవహరిస్తున్నారు. ఇలా వ్యవహరించడం అనేది కేటీఆర్ అహంపై దెబ్బకొట్టినట్లు అవుతోంది. మరోరకంగా చెప్పాలంటే ఇదోరకమైన ప్రతీకారమని చెప్పొచ్చు. మనం ఎంత నిర్ధయగా వ్యవహరించినా, మన శత్రువు మనల్ని క్షమించి వదిలేస్తున్నాడనే విషయాన్ని వారు తట్టుకోలేరు. ఆత్మాభిమానం ఉన్నవారైతే మరో రకంగా వ్యవహిస్తారు. అయితే కేటీఆర్ ఏం చేస్తారనేది ఎదురుచూద్దాం.












Click it and Unblock the Notifications