పోటీ చేయలేను: కొడంగల్‌పై టీఆర్ఎస్ ఇంచార్జ్, రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం
రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.
హైదరాబాద్: రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.
మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ గుర్నాథ్ రెడ్డిని రంగంలోకి దింపాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గుర్నాథ్ రెడ్డి మాత్రం పోటీకి సుముఖంగా లేరని తెలుస్తోంది.
Recommended Video


కొడంగల్‌కు ఉప ఎన్నిక వస్తే
కొడంగల్ ఉప ఎన్నిక వస్తే పోటీ తీవ్రంగా ఉంటుందని, తాను ఇప్పటికే పదిసార్లు పోటీ చేశానని, ఇప్పుడు పోటీ చేసేందుకు తన వయసు సహకరించదని గుర్నాథ్ రెడ్డి చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

రంగంలోకి తనయుడు, నంద్యాల వలె
తమ అబ్బాయిని పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నానని, తన కుమారుడికి ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీగా పని చేసిన అనుభవం ఉందని, అయితే అభ్యర్థి ఎవరనే విషయాన్ని అధినేత కేసీఆరే ఖరారు చేస్తారని, టికెట్ కోసం చాలామంది పోటీలో ఉన్నారని, ఎన్నిక ఏకపక్షంగా అయితే ఉండదని, నంద్యాల మాదిరి ఇక్కడ కూడా ధనప్రవాహం ఉంటుందని గుర్నాథరెడ్డి చెప్పారు.

రేవంత్ రెడ్డి బాటలోనే కంచర్ల భూపాల్ రెడ్డి
టీడీపీకి రేవంత్ రెడ్డి రాజీనామా, దానిని జీర్ణించుకోలేక కంచర్ల భూపాల్ రెడ్డి కంటతడి, మోత్కుపల్లిపై పరోక్ష విమర్శలు, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు రమణ షోకాజ్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. భూపాల్ రెడ్డి.. రేవంత్ బాటలోనే నడవనున్నారు.

రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు దగ్ధం
కంచర్ల భూపాల్ రెడ్డి పార్టీ మారుతారనే విషయం తెలుసుకున్న మరో నేత మాదగోని శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఉన్న రేవంత్ రెడ్డి, కంచర్ల ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. రేవంత్ ఫ్లెక్సీలు దగ్ధం చేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications