Revanth Reddy:శీతాకాలం ప్రత్యేక అతిథిపై సీఎం రేవంత్ ఆసక్తికర పోస్ట్..!!
ప్రకృతితో ఆటలాడితే ఆ పకృతే మానవజాతికి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ప్రకృతిని ఎప్పుడూ కాపాడుకోవాలి. ప్రకృతిని మనం కాపాడితేనే అది మనలను రక్షిస్తుందనే విషయాన్ని తాను బలంగా నమ్ముతానని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇంతకీ రేవంత్ రెడ్డి ప్రకృతి పై ఎందుకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారనేగా మీడౌటు.. అక్కడికే వస్తున్నాం.
హైదరాబాదులో హైడ్రా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రకృతిని సహజవనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇందులో భాగంగా చెరువులను ఆక్రమించి పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా భవంతులు నిర్మించుకున్న వారి భరతం పట్టేలా హైడ్రా చట్టాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా ప్రకృతి ప్రేమికులు. ప్రకృతిని నాశనం చేసేలా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎప్పుడో హెచ్చరించారు. తొలుత చెరువులను పరిరక్షించే క్రమంలో హైడ్రాను తీసుకొచ్చారు. తొలి నాళ్లలో హైడ్రాపై విమర్శలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు విమర్శించిన నోళ్లే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి.

చెరువులను ఆక్రమించి, నీటి వనరులను,పర్యావరణ సంపదను ధ్వంసం చేశామని, ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.ఇక తను ముఖ్యమంత్రి అయ్యాక దీనిపై ప్రత్యేక దృష్టి సారించి హైడ్రా ద్వారా దీనికి అడ్డుకట్ట వేశారు. చెరువులను కబ్జా చేయడంతో ఎన్నో పక్షి జాతులు అంతరించే స్థాయికి వచ్చేశాయి. ఎప్పుడూ చెరువుల్లో కిలకిల రాగాలు పలికే పక్షుల నోళ్లు మూగబోయాయి. అయితే హైడ్రా రాకతో మళ్లీ ఈ పక్షుల కిలకిల రాగాలు వినిపిస్తున్నాయి.
తాజాగా హైడ్రా తీసుకున్న చర్యలతో అమీన్‌పూర్ సరస్సులో అంతరించిపోతున్న జాతికి చెందిన ఓ పక్షి కనిపించింది. దీనిపేరు రెడ్ బ్రెస్టెడ్ ఫ్లైక్యాచర్. ఇది దాదాపుగా 12 సెంటీమీటర్ల పొడవుండే చిన్న పక్షి.శీతకాలంలో తెలంగాణకు ప్రత్యేక అతిథి ఈ పక్షి. ఈ పక్షులు ఐరోపా నుంచి దక్షిణాసియాకు వలస వస్తాయి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో హైదరాబాద్ అమీన్‌పూర్ సరస్సు ఈ వలస పక్షులకు గమ్యస్థానంగా మారింది. చాలా ఏళ్ల తర్వాత ఈ చిన్న పక్షి కనిపించడంతో అక్కడి స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
I always believed that if we take care of nature, nature will take care of us. It is farmer’s wisdom.
— Revanth Reddy (@revanth_anumula) December 2, 2024
We stopped lake encroachments after years of constant depletion and destruction of our water bodies, our ecological wealth, our legacy for our future in the last few months.… pic.twitter.com/GgFCj64wYG
అమీన్‌పూర్ సరస్సు ఒకప్పుడు ఫ్లెమింగోల పక్షులతో పాటు ఇతర జాతి పక్షులకు కూడా ఆవాసంగా ఉండేది.అయితే కొన్నేళ్లుగా పలు పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంది. హైడ్రా రాకతో ఈ చెరువుకు పునర్జీవం వచ్చినట్లయ్యింది. పక్షి ప్రేమికులను మళ్లీ ఈ చెరువు వైపు చూసేలా చేసింది హైడ్రా.ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.ప్రకృతిని మనం ఎంతగా ప్రేమించి కాపాడుతామో ఆ ప్రకృతి తిరిగి మనకు అదే ప్రేమను ఇవ్వడమే కాకుండా మనలను రక్షిస్తుందని సీఎం ట్వీట్ చేశారు. ఇందుకు నిదర్శనం అంతరించిపోతున్న జాతికి చెందిన రెడ్-బ్రెస్టెడ్ ఫ్లైక్యాచర్ పక్షి అమీన్‌పూర్ చెరువులో కనిపించడమే అని చెప్పుకొచ్చారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications