మీరు సీఎం అభ్యర్థి అయితే.., వీహెచ్‌కు పవన్ కౌంటర్, వీహెచ్ ఏమన్నారంటే...
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)ని తెలంగాణ సీఎం అభ్యర్థిగా కనుక కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటిస్తే, ఆయనకు తాను మద్దతిస్తానని, ప్రచారం కూడా చేస్తానని పవన్ అన్నారు.
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)ని తెలంగాణ సీఎం అభ్యర్థిగా కనుక ప్రకటిస్తే, ఆ పార్టీకి తాను మద్దతిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
బుధవారం ఖమ్మం పర్యటనలో పవన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేస్తే, ఆ పార్టీ తరపున నిలబడి ప్రచారం కూడా చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలందరిపైనా తనకు గౌరవం ఉందని, అలాగే, వీహెచ్ పైనా ఉందని, ఎవరిపైనా ద్వేషం లేదని పవన్ అన్నారు.

జనసేన కాదు భజనసేన...
తెలంగాణ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ పార్టీ ‘జనసేన' కాదని, ‘భజనసేన' అని ఆయన ఘాటుగా విమర్శించారు.

వీహెచ్‌కు పవన్ ఆఫర్...
కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు చేసిన విమర్శలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వీహెచ్‌తో కలిసి పనిచేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘వీహెచ్.. మీరు నాతో రండి. ఇంటింటికి తిరుగుదాం.. ప్రజాసమస్యలను తెలుసుకుందాం..' అని పవన్ వీహెచ్‌కు ఆఫర్ కూడా ఇచ్చారు.

కొత్త రాష్ట్రానికి సహకరిద్దాం...
ఏన్నో ఏళ్ల ఉద్యమం తరువాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగారని జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిందని, రాష్ట్ర అభివద్ధిని దృష్టిలో ఉంచుకొని తొలిసారిగా ఏర్పడిన ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా పవన్ కోరారు.

నా పట్ల పవన్ అభిమానమది...
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు బుధవారం స్పందించారు. ఆదినుంచి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తూ.. అంచెలంచెలుగా తాను పైకి ఎదగడం పవన్ వ్యాఖ్యల అర్థమై ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తాను సీఎం అవాలనుకోవడం పవన్ కళ్యాణ్ అభిమానం అయి ఉండొచ్చని, అయితే కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థిని పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని అన్నారు. పవన్ వ్యాఖ్యలను ఎవరో ఒకరు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళతారని ఆయన చమత్కరించారు.

నువ్వు నాతో రా.. తీసుకెళ్తా...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లో ఇంకా మార్పు రావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. పవన్ తనపై సానుకూల వ్యాఖ్యలు చేయడం కాదని, ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఆయన గుర్తెరగాలని అన్నారు. పవన్ చేసే వ్యాఖ్యల మేరకే తన కామెంట్లు ఉంటాయని వీహెచ్ పేర్కొన్నారు. ‘నేను పవన్ తో పాటు వెళ్లడం కాదు.. పవన్ నాతో కలిసి వస్తానంటే కనుక పల్లెల్లో రైతుల కష్టాలు, ప్రాజెక్టుల్లో అవినీతి నిరూపిస్తా..' అని ఆయన వ్యాఖ్యానించారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!











Click it and Unblock the Notifications