డిప్రెషన్‌లో మీరే నా డాక్టర్: హీరో మహేష్ బాబుకు లేఖ రాసి ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఓ విద్యార్థి హాస్టల్ రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబ సభ్యులకు ఓ లేఖ, నటుడు మహేష్ బాబుకు మరో లేఖ రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు వివారలు వెల్లడించారు.

గుంటూరు జిల్లా సిద్ధార్థ నగర్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి బెంగళూరులో ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగి. ఆయనకు భార్య మయూరి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు సునంద్ కుమార్ రెడ్డి. వయస్సు 21. ఇతను గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్స్ సైన్స్ డ్యూయల్ డిగ్రీ చదువుతున్నాడు.

ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు

ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు

క్యాంపస్‌లోని పాత బాయ్స్ హాస్టల్‌లోని ఓ గదిలో అతను ఉంటున్నాడు. గత మూడు రోజులుగా అతను ముభావంగా ఉంటున్నాడు. స్నేహితులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. బుధవారం, గురువారం కూడా సునంద్ కుమార్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఓ స్నేహితుడు గదికి వచ్చి చూశాడు. లోపల గడియ పెట్టి ఉండటంతో కిటికీ వద్దకు వెళ్లి చూశాడు.

డిప్రెషన్‌కు ఇతర కారణాలు

డిప్రెషన్‌కు ఇతర కారణాలు

దీంతో ఆ స్నేహితుడు సెక్యూరిటీని పిలిచి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. అతని మృతికి చదువు ఒత్తిడి కారణం కాదని తెలుస్తోంది. డిప్రెషన్‌కు ఇతర కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. సునంద్ రెడ్డి గదిలో పోలీసులు రెండు లేఖలను గుర్తించారు. అందులో ఒకటి తల్లిదండ్రులకు, మరొకటి నటుడు మహేష్ బాబుకు రాసి ఉంది. అవి ఇంగ్లీష్‌లో ఉన్నాయి.

మీరంటే ఇష్టం, కానీ మన బంధుత్వ వ్యవస్థ బాగా లేదు

మీరంటే ఇష్టం, కానీ మన బంధుత్వ వ్యవస్థ బాగా లేదు

మన బంధువులు కేవలం అవసరానికి మాత్రమే వచ్చి వెళ్తారని, మన బంధుత్వ వ్యవస్థ బాగా లేదని, అమ్మా.. నాన్న మీరంటే నాకు చాలా ఇష్టమని, ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నందుకు నన్ను క్షమించాలని అందులో పేర్కొన్నారు.

 మీరే నా డాక్టర్

మీరే నా డాక్టర్


అతని గదిలో చాలా వరకు సినిమా నటుడు మహేష్ బాబు ఫోటోలు ఉన్నాయి. అతను మహేష్ బాబుకు పెద్ద అభిమాని. మరో లేఖలో మహేష్ బాబును ఉద్దేశించి రాశాడు. నేను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు మీ సినిమాలే చూస్తుంటానని, మీరంటే నాకు ఇష్టమని, మీరు నా డాక్టర్, నాకు స్ఫూర్తిని ఇచ్చారని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+