పెళ్లి చేసుకొని తమిళ నటుడు మోసం చేశాడు: తెలుగు నటి హేమ

హైదరాబాద్/చెన్నై: తమిళ నటుడు ఇళయరాజా రెండేళ్ల క్రితం ప్రేమించానని వెంటబడ్డాడని, తనను పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు మోసం చేసి మరో యువతితో పెళ్లి సిద్ధమయ్యాడని తెలుగు సినీ నటి హేమ శనివారం మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు.

తాను గతంలోనే చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయినా వాళ్లు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం కావాలని ఆమె చెప్పారు. కాగా, ఆమె కథనం ప్రకారం... వరంగల్ జిల్లాకు చెందిన హేమ పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది.

చెన్నైలో ఓ సినిమాలో నటిస్తుండగా తమిళ నటుడు ఇళయరాజాతో పరిచయం ఏర్పడింది. ప్రేమకు దారి తీసింది. ఇద్దరు రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇళయరాజా సోదరుడికి ఇటీవల పెళ్లి కుదిరింది. పెళ్లి కుమార్తె చెల్లెలు ఇళయరాజాకు నచ్చింది.

నటి హేమ

నటి హేమ

దీంతో ఆమెను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడని హేమ ఆరోపిస్తున్నారు. తన పరిస్థితి ఏమిటని నిలదీస్తే తప్పించుకొని తిరుగుతున్నాడని చెప్పారు.

 నటి హేమ

నటి హేమ

ఇళయరాజా బంధువు పోలీసు అధికారి కావడం, వారికి రాజకీయ అండ ఉండటంతో తన ఫిర్యాదును పట్టించుకోలేదని హేమ అన్నారు.

 నటి హేమ

నటి హేమ

తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిని తాను కలిశానని, తనకు న్యాయం కావాలని కోరానని హేమ ఈ సందర్భంగా చెప్పారు.

 నటి హేమ

నటి హేమ

చెన్నైలో కేసు కాబట్టి.. ఓ సిఫార్సు లేఖ ఇవ్వగలనని మంత్రి చెప్పారని నటి హేమ చెప్పారు. షీ టీం డీజీ స్వాతి లక్రాను కలిశాననిచెప్పారు. తనకు సాయం చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+