హైదరాబాద్ చిత్తడి, క్లౌడ్ బరస్ట్ - వర్క్ ఫ్రమ్ హోం.. బిగ్ అలర్ట్..!!

హైదరాబాద్ భారీ వర్షాలతో తడిసి ముద్దైంది. వరణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గ్రేటర్ పరిధిలో వర్షం దంచికొడుతోంది. గడిచిన రెండు వారాలుగా హైదరాబాద్‌ను వరుణుడు వదలటం లేదు. నగర వ్యాప్తంగా ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోమ్‌ ఇవ్వాలని సైబరాబాద్‌ పోలీసులు ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

గురువారం రాత్రి నుంచి హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐటీ పరిశ్రమలు అత్యధికంగా ఉన్న సైబరాబాద్‌ పరిధిలోని గచ్చిబౌలి, కొండాపూర్‌, కోకాపేట్‌, నానక్‌రామ్‌గూడలో సాధారణ రోజుల్లోనే భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

IMD issues 7-day forecast of heavy rain for Hyderabad Work form Home for IT Companies

నగర రోడ్లపై వరద నీరు వచ్చి చేరింది. ఉదయం ఆఫీస్‌లకు వెళ్ళే సమయం కావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవ్వరూ కూడా అనవసరంగా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని హైడ్రా, జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రా డీఆర్‌ఎస్, జీహెచ్‌ఎంసీ మాన్సూన్ బృందాలు రంగంలోకి దిగాయి. మ్యాన్‌హోల్స్ మూతలు తెరవద్దని నగర వాసులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు, జీహెచ్ఎంసీ కీలక సూచనలు చేసింది. సైబరాబాద్ ప్రాంతంలో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సూచనలు చేసింది. కంపెనీలు సహకారం అందించాలని సైబరాబాద్ పోలీసులు కోరారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+