Weather: తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్

హైదరాబాద్: తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం మూడు రోజులపాటు 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. ఇప్పటికే, గత రాష్ట్రంలో రెండు, మూడు రోజులుగా కొన్ని జిల్లాల్లో జోరు వానలు దంచికొడుతున్నాయి.

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా ఛత్తీస్ గఢ్ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరించింది. పలు జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. ముఖ్యంగా దక్షిణ, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణశాఖ అధికారులు. మూడ్రోజులుగా పడుతున్న వడగండ్ల వానలకు పలు ప్రాంతాల్లో తీవ్రంగా పంటనష్టపోయారు రైతులు. పంటల నష్టంపై వ్యవసాయ అధికారులు వెంటనే సర్వే చేపట్టి రైతులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.

ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు

ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు

హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త ధర్మ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి ఉత్తర ఇంటీరియర్ ఒడిశా వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉంది. రెండు రోజుల పాటు తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

తెలంగాణలోని పలు జిల్లాల్ల వడగళ్లవాన, భారీ వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్ల వడగళ్లవాన, భారీ వర్షం

తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించింది' అని ధర్మరాజు తెలిపారు.

హైదరాబాద్‌లో అకాల వర్షం, పడిపోతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌లో అకాల వర్షం, పడిపోతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ నగరం, పరిసరాల్లోని స్థానిక సూచన సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. హైదరాబాద్ నగరంలో గురువారం తెల్లవారుజామున బూడిద మేఘాలు కమ్ముకున్నాయి, అకాల వర్షం హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసింది. 'రాబోయే 24 గంటల్లో కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో వరుసగా 27 డిగ్రీల సెల్సియస్, 20 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+