మరో రెండు అల్పపీడనాలు, భారీ వర్షాలు..ఫ్లాష్ ఫ్లడ్స్ - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తెలంగాణ తో పాటుగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కాగా.. భారీ వర్షాల హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. రానున్న వారం రోజుల్లో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.
తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడతాయని అంచనావేసింది. ద్రోణి కారణంగా హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా మారాయి. మేఘావృతమైన ఆకాశంతో పాటు కాసేపు ఎండ కాస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల వర్షం వల్ల రోడ్లపై వర్షపు నీరు చేరింది. వర్షం కొనసాగితే మరింతగా ట్రాఫిక్ సమస్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగా రెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిని ప్రకటించింది. ఈ నెల 28న, నవంబర్ 2న అల్ప పీడనాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలతో పాటు యానాంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాయలసీమలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్ల పైకి నీరు చేరింది. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వర్షం కొనసాగుతోంది. వర్ష ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ప్రభుత్వం నిర్దేశించింది.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications