తెలంగాణలో ఈ వారంలోనే 40 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు: హైదరాబాద్ మాత్రం కూల్‌గానే!

ఈ వారంలోనే తెలంగాణరాష్ట్రంలో 40 డిగ్రీల సెల్సియస్ కు పెరిగే అకవాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

హైదరాబాద్: తెలంగాణలో అప్పుడే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి కాలం మొదలు కాకముందే నిప్పులు కురిపిస్తున్నాడు. ఇక ఈ వారంలోనే తెలంగాణరాష్ట్రంలో 40 డిగ్రీల సెల్సియస్ కు పెరిగే అకవాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలు బయటికి వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

హైదరాబాద్ మినహా తెలంగాణలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ మినహా తెలంగాణలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు

మార్చి నెల రెండు మూడో వారాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌ నగరంలో ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. తెలంగాణలోని చాలా జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

హైదరాబాద్‌లో తగ్గిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌లో తగ్గిన ఉష్ణోగ్రతలు

మరోవైపు, హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో అసాధారణమైన ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచాయి. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఫలితంగా హైదరాబాద్ నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత తగ్గింది. ఇది మండుతున్న ఎండవేడిమి నుంచి చాలా అవసరమైన ఉపశమనాన్ని కలిగించింది.

హైదరాబాద్‌లో కొంత చల్లాగానే.. ఎందుకంటే?

హైదరాబాద్‌లో కొంత చల్లాగానే.. ఎందుకంటే?


హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకారం.. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత సోమవారం 34.7 డిగ్రీల నుంచి మంగళవారం 30.7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.తెలంగాణలోని ఉత్తర జిల్లాల్లో మంగళవారం వడగళ్ల వానలు, ఈదురు గాలులు వీచాయి. దీంతో హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) అంచనా వేసింది. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 19 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంటుంది. అయితే మార్చి 10, 2023 వరకు గరిష్ట ఉష్ణోగ్రత 32, 34 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.

తెలంగాణలో ఈ ఏడాది మండిపోనున్న ఎండలు: ఎల్‌నినో ఎఫెక్ట్

తెలంగాణలో ఈ ఏడాది మండిపోనున్న ఎండలు: ఎల్‌నినో ఎఫెక్ట్

తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ అంచనాల ప్రకారం తెలంగాణలో ఈ ఏడాది వేసవి కాలం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దీనికి కారణం ఎల్‌నినో పరిణామం కావచ్చని పేర్కొంది. ఎల్ నినో సంఘటన తెలంగాణలో వేసవిలో ఉష్ణోగ్రతను పెంచడమే కాకుండా వర్షపాతం, పంటల ఉత్పత్తిపై కూడా ప్రభావితం చూపిస్తుంది. ఇది తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలం అసాధారణంగా వేడెక్కడానికి దారితీసే వాతావరణ నమూనా. ఈ ప్రభావం వల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాతావరణ వ్యవస్థలో ఎల్ నినో ఒక ముఖ్యమైన భాగం, దాని ప్రభావాలు ఒక సంవత్సరం కంటే తక్కువ కాలం పాటు ఉండవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+