గౌతమి, సింహపురి, గోదావరి ఎక్స్‌ప్రెస్ లకు కొత్త హాల్ట్ స్టేషన్
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి జనవరి 7 నుండి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు చర్లపల్లి స్టేషన్‌లో 11 రైళ్లకు తాత్కాలిక హాల్ట్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. సికింద్రాబాద్ స్టేషన్‌పై భారాన్ని తగ్గించడం, పండుగ రద్దీలో ప్రయాణీకులకు సౌలభ్యం అందించడమే ఈ చర్యల ఉద్దేశ్యం.
జనవరి 7 ఉదయం నుండి జనవరి 20 సాయంత్రం వరకు ఈ హాల్ట్ అమల్లో ఉంటుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్న విషయం తెలిసిందే. దీనికితోడు- రోజువారీ రైళ్లతో పాటు పలు ప్రత్యేక సర్వీసులకు ఈ స్టేషన్ ప్రధాన గమ్యస్థానం కావడం వల్ల ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న చర్లపల్లి స్టేషన్ ను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

చర్లపల్లిలో ఆగే రైళ్లు: 12709 గూడూరు- సికింద్రాబాద్ సింహాపురి ఎక్స్‌ప్రెస్ (తెల్లవారు జామున 4:29/4:30, ప్రతిరోజు), 12737 కాకినాడ- లింగంపల్లి గౌతమి ఎక్స్‌ప్రెస్ (తెల్లవారు జామున 4:09/4:10, ప్రతిరోజు), 12763 తిరుపతి - సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్ (తెల్లవారు జామున 5:09/5:10, వారానికి 5 రోజులు), 12775 కాకినాడ టౌన్ - లింగంపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (తెల్లవారు జామున 5:59/6:00, వారానికి 3 రోజులు).
అలాగే, 12739 విశాఖపట్నం- సికింద్రాబాద్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ (ఉదయం 7:29/7:30, ప్రతిరోజు), 17016 సికింద్రాబాద్ - భువనేశ్వర్ న్యూ విశాఖ ఎక్స్‌ప్రెస్ (సాయంత్రం 5:09/5:10, ప్రతిరోజు), 12728 హైదరాబాద్- విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ (సాయంత్రం 5:44/5:45, ప్రతిరోజు), 12776 లింగంపల్లి- కాకినాడ ఎక్స్‌ప్రెస్ (సాయంత్రం 7:55/7:56, వారానికి 3 రోజులు) కూడా చర్లపల్లిలో ఆగనున్నాయి.
ఇవి కాకుండా 12740 సికింద్రాబాద్- విశాఖపట్నం గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ (రాత్రి 8:45/8:46, ప్రతిరోజు), 12738 లింగంపల్లి- కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్ (రాత్రి 9:29/9:30, ప్రతిరోజు), 12710 సికింద్రాబాద్ - గూడూరు సింహాపురి ఎక్స్‌ప్రెస్ (రాత్రి 10:20/10:21, ప్రతిరోజు) రైళ్లు కూడా చర్లపల్లి స్టేషన్ లో ఆగి వెళ్తాయి.












Click it and Unblock the Notifications