మనవరాలి వరసయ్యే యువతిపై లైంగికదాడి : పెద్దల పంచాయతీ, మనస్థాపంతో యువతి ఆత్మహత్య

హైదరాబాద్ : వావి వరుస లేదు. కొందరికి కామంతో కళ్లు మూసుకుపోతున్నాయి. ఆడించి, పాడించిన చేతులే ఆకృత్యానికి తెగబడుతున్నాయి. మీర్ పేట పోలీసుస్టేషన్ పరిధిలో ఓ తాతయ్య మననరాలి వరుసయ్యే యువతిపై లైంగికదాడి చేసి గర్భవతిని చేశాడు.

మాటలు కలిపి ...

మాటలు కలిపి ...

మీర్ పేట ప్రశాంత్ నగర్ కు చెందిన మొగులయ్యకు ముగ్గురు కూతుళ్లు. 2008లో భార్య చనిపోవడంతో మిర్యాలగూడకు చెందిన దుర్గమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. దుర్గమ్మ మేనమామ మల్లేశ్ మొగ్గులయ్య ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో మొగులయ్య రెండో కూతురు అనితకు మల్లేశ్ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమెపై లైంగికదాడి చేసి గర్భవతిని చేశాడు.

 మనస్థాపంతో ఆత్మహత్య

మనస్థాపంతో ఆత్మహత్య

ఈ విషయం అనిత పేరెంట్స్‌కు తెలిసింది. ఇదేంటని మల్లేశ్‌తో మొగులయ్య దంపతులు గొడవకు దిగారు. బాధితురాలికి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా పెద్దలు తీర్మానించారు. తనపై లైంగికదాడి .. పరిహారం ఇప్పించడంతో అనిత మనస్థాపానికి గురైంది. నిన్న రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

పరారీలో నిందితుడు

పరారీలో నిందితుడు

ఈ ఘటనపై వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత డెడ్ డాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడు మల్లేశ్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని .. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని వెల్లడించారు. మనవరాలి వయసయ్యే యువతిపై లైంగికదాడి చేసిన మల్లేశ్‌ను కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+