కొడుకును ఆటోకేసి బాదిన తండ్రి అరెస్ట్, ఓ మహిళతో సంబంధమే కారణం

హైదరాబాద్: మూడేళ్ల తన కుమారుడిని ఆటోకు వేసి బాదిన ఉన్మాది తండ్రి శివను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. శివ, అనూషలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శివకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది.

Recommended Video

    9నెలల కొడుకును ఆటోకేసి కొట్టాడు, వివాహేతర బంధం ప్రశ్నిస్తే

    అతను ఇద్దరితోను ఎప్పుడు గొడవపడుతుండేవాడు. ఈ నెల 9వ తేదీన రాత్రి వివాహేతర సంబంధం ఉన్న మహిళతో గొడవపడి అనూష వద్దకు వచ్చాడు. సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో పోలీసులు ఆమెతో కలిసి శివ, అనూషల వద్దకు వచ్చారు.

    In Front Of Cops, 3 Year Old Child Assaulted By Drunk Father In Hyderabad

    ఈ సమయంలో ఆగ్రహంతో ఉన్మాదిలా మారాడు శివ. తన మూడేళ్ల కొడుకును ఆటోకు వేసి బాదేశాడు. బాలుడికి కొద్దిగా గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్, చైల్డ్‌లైన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని శిశువిహార్‌కు తరలించారు. అనంతరం శివను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, హైదరాబాదులోని జ‌గ‌ద్గిరిగుట్ట లెనిన్ న‌గ‌ర్‌లో ఈ దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+