Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లాలో దూసుకెళ్తున్న కాంగ్రెస్..!
ఉమ్మండి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. అధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతోన్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ముందంజలో ఉన్నారు. హుజుర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. కోదాడలో ఆయన సతీమణి ఉత్తమ్ పద్మావతి ముందంజలో ఉన్నారు. తుంగతుర్తిలో మందుల శ్యామ్యుల్ ఆధిక్యంలో ఉన్నారు.

భువనగిరి లో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ ముందంజలో ఉన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. నాగార్జునసాగర్, దేవరకొండలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications