పెళ్లి చేసుకుని సిరియా వెళ్లాలని నిక్కీ జోసెప్, మొహియుద్దీన్ ప్లాన్
హైదరాబాద్: ఐఎఎస్ఐఎస్ కోసం పనిచేస్తున్న మొహయిద్దీన్, నిక్కీ జోసెఫ్ పెళ్లి చేసుకుని సిరియా వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకుని ఆచరణలో పెట్టే క్రమంలోనే హైదరాబాదు పోలీసులకు చిక్కారు. ఫేస్‌బుక్‌లో నకిలీ పేర్లతో చాటింగ్ చేసే మొహియుద్దీన్, అఫ్షా జబీన్ భావజాలం ఒకటే కావడంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
అతడు 2014 చివర్లో పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. పెళ్లి చేసుకుని సిరియా వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. దాన్ని అమలు చేసే క్రమంలోనే హైదరాబాద్‌కు వచ్చిన మొహియుద్దీన్‌ను ఈ ఏడాది జనవరి 16న పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో అఫ్షాజబీన్ అలియాస్ నిక్కీ జోసెఫ్ వివరాలు బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఫేస్‌బుక్ యాజమాన్యంతో మాట్లాడి వీరిద్దరూ కలిసి నిర్వహించిన ఖాతాలను నిలిపివేయించారు.

మొహియుద్దీన్ అరెస్టు అనంతరం ఆమె సోషల్ మీడియాలో తన ఆధారాలు దొరక్కుండా పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పోలీసులు సమర్థంగా దర్యాప్తు కొనసాగించి ఆమెను శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఆమె నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు 10 రోజుల పోలీసు కస్టడీ కోరుతూ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇది జాతీయ, అంతర్జాతీయ అంశాలతో ముడిపడిన కేసు కాబట్టి స్థానిక పోలీసుల విచారణ అనంతరం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు కోర్టు అనుమతితో జబీన్‌ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జబీన్ మొహియుద్దీన్‌కు తనను తాను యూకే దేశస్తురాలిగా పేర్కొంటూ నిక్కీజోసెఫ్ అనే మారుపేరుతో చలామణి అయింది. వారిద్దరూ కలిసి ‘దౌలా న్యూరూం', ‘మోడరేట్స్ వర్సెస్ లిబరల్స్', ‘దౌలా ఇస్లామియా', ‘రెవల్యూషన్ అండ్ హడిత్' పేరుతో ఇంటర్‌నెట్‌లో గ్రూపులు ఏర్పాటుచేసి యువతను ఐఎస్‌వైపు ఆకర్షించే విధంగా పోస్టులు, వీడియోలు పెట్టేవారు. ఆ గ్రూపుల్లో 50 వేల మంది దాకా సభ్యులున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications