నష్టపరిహారం చెల్లింపుల్లో వేగం పెంచండి..! మల్లన్న సాగర్ పై సీఎం సమీక్ష..!!
Recommended Video
హైదరాబాద్: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు సహాయ, పునరావాసంపై తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. నిర్వాసితులకు తగిన పరిహారం ఇవ్వాలని, సహాయ పునరావాస చర్యలు చేపట్టాలంటూ ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో సీఎం ఈ అంశంపై మరోసారి సమీక్షించారు.
ఇప్పటికే యుద్ధప్రాతిపదికన పరిహార చెల్లింపు పనులు చేపట్టాలని, ఈ రోజు నాటికి (మే 11) ఈఅంశంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ సీఎం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 15న మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వ్యవహారం హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో చెక్కుల పంపిణీ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో అధికారులతో సమీక్షిస్తున్నారు.

అయితే, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కోసం అధికారులు ఆయా గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటుచేసి పరిహారం చెల్లింపును పూర్తిచేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చెక్కుల పంపిణీ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఏయే గ్రామాల్లో ఎంతమంది నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు? ఎంత మొత్తంలో పంపిణీ చేశారు?
ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉన్నారా? తదితర అంశాలను సీఎం అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ ఎస్కే జోసీతో పాటు సోమేశ్‌కుమార్, స్మితా సబర్వాల్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, పరిహారం పంపిణీని పూర్తిస్థాయిలో పర్యవేక్షించిన కొందరు అధికారులు పాల్గొన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications