ఆదర్శ రాష్ట్రం: తెలంగాణకు ఇండియాటుడే అవార్డు, కెసిఆర్‌కు ఆహ్వానం
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సమగ్రాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రానికి ప్రముఖ మేగజైన్ ఇండియాటుడే అవార్డు లభించింది. ప్రజా సంక్షేమ పథకాలతోపాటు సమగ్రాభివృద్ధిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడంతో ఈ అవార్డు దక్కింది.
ఇండియా టుడే దేశంలో 29 రాష్ర్టాల్లో అమలవుతున్న పథకాలు, వాటి అమలు తీరును పరిశీలించి తెలంగాణను ఈ అవార్డుకు ఎంపికచేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఇండియా టుడే ఎడిటోరియల్ డైరెక్టర్ రాజ్ చెంగప్ప స్వయంగా లేఖ రాశారు. ఢిల్లీలో నవంబర్ ఆరున నిర్వహించే ఇండియా టుడే- స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాంక్లేవ్-2015 కార్యక్రమంలో ఈ అవార్డును అందజేస్తారు.
అవార్డును స్వీకరించేందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజ్ చెంగప్ప ఆహ్వానించారు. సమగ్రాభివృద్ధిలో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలవడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ రూపొందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే అంతర్జాతీయస్థాయిలో ఎంతో గుర్తింపు పొందాయని అన్నారు.

వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ లాంటి పథకాలను ఇతర రాష్ర్టాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. రాష్ట్రం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలోనే పలు అవార్డులను కైవసం చేసుకున్న తెలంగాణ రాష్ట్రం, తాజాగా ఇండియా టుడే అవార్డుకు ఎంపికయ్యింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఇండియా టుడే పరిశీలించింది.
పథకాలను నూటిని నూరు శాతం పక్కాగా అమలు చేస్తున్న తెలంగాణను ఉత్తమ రాష్ట్రంగా ఎంపిక చేసింది. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన, గ్రామీణ ప్రాంతాల్లో జనాభాకు అనుగుణంగా సగటున బ్యాంకు శాఖలు ఎన్ని ఉన్నాయి? పోస్టాఫీసులు, టెలిఫోన్ కనెక్షన్లు, మొబైల్స్, బ్రాడ్‌బ్యాండ్, వంట గ్యాస్ కనెక్షన్లు, పంచాయతీ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం, సమగ్రాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను గత జూన్ నుంచి పరిశీలించారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఆసరా పింఛన్లు, రైతు రుణమాఫీ, వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దళితులకు భూ పంపిణీ, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలు తెలంగాణను దేశంలో మొదటిస్థానంలో నిలిపాయి.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications