తెలంగాణలో కాంగ్రెస్ జోరు ! బీఆర్ఎస్, బీజేపీకి షాక్ ? తేల్చేసిన జాతీయ సర్వే..!

సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్ధితి ఎలా ఉంది. ఏ పార్టీ లీడ్ లో ఉంది, లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతోందన్న దానిపై జాతీయ మీడియా నెట్ వర్క్ ఇండియా టుడే .. సీ ఓటర్ తో కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సర్వే నిర్వహించింది. దాని ఫలితాలను ఇవాళ వెల్లడించింది. ఇందులో దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు తేల్చింది. అయితే తెలంగాణలో మాత్రం ఇండియా కూటమి హవా ఉంటుందని వెల్లడించింది.

డిసెంబర్ 15 నుంచి జనవరి 28 వరకూ తెలంగాణలో నిర్వహించిన ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 10 సీట్లు గెల్చుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. అటు విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు తలో మూడు సీట్లు మాత్రమే గెల్చుకునే అవకాశం ఉంది. చివరిగా హైదరాబాద్ ఎంపీ సీటును మజ్లిస్ పార్టీ మరోసారి నిలబెట్టుకోబోతోంది.

India Today-C Voter mood of the nation survey predicts Congress lead Telangana Lok sabha polls

Recommended Video

    Revanth Reddy Raja Singh Friendship.. Assembly లో షాకింగ్ ఘటన చూసారా.. | Telugu Oneindia

    తెలంగాణలో ఇండియా కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 41.2 శాతం ఓట్లు దక్కించుకోబోతున్నట్లు ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో తేలింది. అలాగే బీఆర్ఎస్ 29.1 శాతం, బీజేపీ 21.1 శాతం ఓట్లు దక్కించుకోబోతున్నాయి. అసలే మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ఈసారి దేశంలో 400 సీట్ల మార్క్ తాకాలని ఉబలాటపడుతున్న వేళ తెలంగాణలో మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఫలితాలు ఆ పార్టీకి షాకిచ్చినట్లే భావిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+