చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిట్ కాయిన్ ఎక్సేంజీల్లో ఐటీ సోదాలు: బ్లాక్‌మనీ-ఎన్నారైల పెట్టుబడులపై ఆరా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ఢిల్లీ: హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ఘజియాబాద్, బెంగళూరు తదితర చోట్ల ఉన్న బిట్ కాయిన్ సంస్థల్లో ఐటీ సోదాలు నిర్వహించింది. నల్లధనం, ఎన్నారైల పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. భాగ్యనగరంలోని ఓ సంస్థలోను సోదాలు నిర్వహించినట్లుగా వార్తలు వచ్చాయి.

నల్లధనాన్ని పెట్టుబడులుగా మార్చుకునేందుకు కొందరు పెద్దలు వీటిని ఉపయోగించుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. ఒక్కో బిట్ కాయిన్ ధర రూ.11 లక్షల పదివేల వరకు ఉంటుంది. బిట్ కాయిన్ విలువ పెరుగుతుండటంతో పలువురి చూపు అటువైపు మరలింది.

అనూహ్యంగా పెరిగిన బిట్ కాయిన్ విలువ

అనూహ్యంగా పెరిగిన బిట్ కాయిన్ విలువ

జనవరిలో రూ.65000గా ఉన్న ఒక బిట్‌ కాయిన్‌ విలువ ఇటీవల దాదాపు రూ.11 లక్షలుకు పైగా చేరింది. అనూహ్యంగా పెరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే అందులో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు పొందినవారు పన్నులు ఎగవేస్తున్నారని ఐటీ విభాగం అనుమానిస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా బిట్ కాయిన్ ఎక్సేంజ్‌లపై సర్వే నిర్వహించింది. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, గురుగ్రామ్ తదితర తొమ్మిది బిట్ కాయిన్ ఎక్సేంజీలను ఐటీ అధికారులు సందర్శించారని తెలుస్తోంది.

 బిట్ కాయిన్‌పై తొలి పెద్ద చర్య

బిట్ కాయిన్‌పై తొలి పెద్ద చర్య

ఇన్వెస్టర్లు, ట్రేడర్స్.. వారు జరిపిన లావాదేవీలు, అవతలి పక్షం వాళ్ల గుర్తింపు, సంబంధిత బ్యాంకు ఖాతాలను తెలుసుకొని సాక్ష్యాలను తెలుసుకునేందుకు వారు సందర్శించారని తెలుస్తోంది. బిట్ కాయిన్‌కు సంబంధించి దేశంలో తీసుకున్న తొలి పెద్ద చర్య ఇదే అంటున్నారు.

 వర్చువల్ కరెన్సీ బిట్ కాయిన్

వర్చువల్ కరెన్సీ బిట్ కాయిన్

బిట్ కాయిన్ ఎవరి నియంత్రణలోనూ లేని వర్చువల్‌ కరెన్సీ. దీంతో భారత్‌ సహా పలు దేశాల రిజర్వ్ బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ తరహా అనియంత్రిత డిజిటల్‌ కరెన్సీలకు దూరంగా ఉండాలంటూ ఆర్బీఐ హెచ్చరించింది కూడా. కాగా బిట్ కాయిన్ బ్యాంకులపై పై దక్షిణ కొరియా నిషేధం విధించింది. బిట్ కాయిన్ సరఫరాను పట్టి ధర మారుతుంది. దీని ధర నిర్ణయించేందుకు ఓ పద్ధతి అంటూ లేదు. ఒక్కో ఎక్సేంజీలో ఒక్కో ధర ఉంటుంది.

 బిట్ కాయిన్ తర్వాత లైట్ కాయిన్

బిట్ కాయిన్ తర్వాత లైట్ కాయిన్

ఇటీవలి కాలంలో బిట్ కాయిన్‌తో పాటు లైట్ కాయిన్ అనే మరో పేరు వినిపిస్తోంది. డిసెంబర్ 11న 148 డాలర్లుగా ఉన్న ఇది 48 గంటలు గడిచేసరికి 309 డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో దీని ధర కేవలం 4 డాలర్లు. ఇదిలా ఉండగా అమెరికా ప్రభుత్వం త్వరలో నియంత్రణ సంస్థల పరిధిలో ఉండే డిజిటల్ కరెన్సీ అయిన ఆయిల్ కాయిన్‌ను తీసుకు రానుంది.

English summary
The Income Tax Department has come down heavily on major Bitcoin exchanges in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X