ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేస్తున్నారా? అయితే హెచ్చరిక!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇదే సమయంలో క్యూర్ పరిధిలో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను నిర్ధారించి లబ్ధిదారులని ఎంపిక చేసి వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో సైబర్ మోసాలు

ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పైన హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. పదివేల రూపాయలు ఈఎండి చెల్లింపుల పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ కాల్స్ చేస్తున్నారని, ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే ఈ లింక్ ఓపెన్ చేయాలని, అందులో అడిగిన వివరాలను ఇవ్వాలని చెబుతూ, లింకులు పంపి ప్రజలను మోసం చేస్తున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు.

Indiramma houses scam Hyderabad CP Sajjanar warns public about cyber frauds on Indiramma houses

whatsapp, smsలలో వచ్చే అపరిచిత లింకులు, ఏపీకే ఫైల్స్ పై అలెర్ట్

డబ్బులు చెల్లిస్తే ఇల్లు కేటాయిస్తామని మాయమాటలు చెప్పే వారిని నమ్మొద్దని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా లబ్ధిని పొందాలంటే ఈరోజే చివరి రోజు అని ఒత్తిడి తెచ్చి డబ్బులు దోచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. whatsapp, smsలలో వచ్చే అపరిచిత లింకులు, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దని, పొరపాటున కూడా ఎనీ డెస్క్, టీం వ్యూవర్ వంటి స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

ఇవి ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు

యూపీఐ పిన్, ఆధార్, బ్యాంక్ వివరాలు, ఓటిపిలు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందని, మధ్య దళారులకు ఎటువంటి ఆస్కారం లేదని తెలిపారు.ఇల్లు కేటాయించకపోతే ఈఎండి ప్రభుత్వమే దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాలోకి తిరిగి జమ చేస్తుందని సీపీ సజ్జనార్ హామీ ఇచ్చారు.

సైబర్ మోసాల విషయంలో చాలా అప్రమత్తం

ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చేయాలని ఆయన సూచించారు. ప్రజలు సైబర్ మోసాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+