సోనియమ్మ రాజ్యంలో ఇందిరమ్మ సంక్షేమం.! తెలంగాణలో రేవంత్ సర్కార్ తిరుగులేని ఏడాది పాలన.!!
హైదరాబాద్ : ప్రజా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ అడుగులు అప్రతిహతం..ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనలో రేవంత్ ప్రభుత్వం అజరామరం..ప్రజల మోహం చూడని గత ప్రభుత్వ పాలన నుండి నిత్యం ప్రజలతో మమేకం అయ్యే ప్రజా పాలన వరకూ.. ఏడాది స్వల్ప కాలంలోనే ప్రజాపాలన దిశగా రేవంత్ సర్కార్ బలమైన అడుగులు.. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన గత ప్రభుత్వం.. గత ప్రభుత్వం చేసిన అప్పుకు 6500కోట్ల మిత్తీ చెల్లిస్తున్న రేవంత్ ప్రభుత్వం.. ఏడాది కాంగ్రెస్ పాలన, సీఎంగా రేవంత్ రెడ్డి సాహసోపేత నిర్ణయాలపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.
నిరాశ నిస్పృహ నుండి ఎగిసిపడే కెరటం దాకా.!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తికావస్తుంది. పెను సవాళ్లు, సమస్యలసు అధిగమించి, బీఆర్ఎస్ అనే మహా వృక్షాన్ని కూకటి వేళ్లతో పెకిలించి, అసాద్యమనుకున్న గెలుపును సుసాద్యం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐనప్పటికీ ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజాధరణ పొందడంలో కాంగ్రెస్ నాయకులు పూర్తి స్దాయిలో విఫలం చెందారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పీసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి జవసత్తువలు అందాయి. నిరాశ నిస్పృహలో ఉన్న పార్టీలో ఆశలను చిగురింపజేసారు రేవంత్ రెడ్డి. పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో, శ్రేణుల్లో ఓ భరోసాను కల్పించగలిగారు. ఎన్నికల నగరా మోగిన తర్వాత రేవంత్ మరింత దూకుడు పెంచారు.

సామాన్య కార్యకర్త దగ్గర నుండి నాయకుల వరకూ భరోసా కల్పించిన రేవంత్ నాయకత్వం.!
తెలంగాణలో అనేక బహిరంగ సభలు నిర్వహిస్తూ రాష్ట్రం ఏ విధమైన దోపిడీకి గురైంది, ప్రజలు ఏవిధంగా మోసానికి గురవుతున్నారు అనే అంశాలను తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో సీఎంగా కేసీఆర్ ఎలాంటి అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు, అధికారాన్ని అడ్డం పెడ్డుకుని కేటీఆర్, హరీష్ రావు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనే అంశాలను ప్రతి బహిరంగ సభలో రేవంత్ తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసారు. కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా రేవంత్ రెడ్డికి ఉందనే అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజానికంలో కలిగించడంలో రేవంత్ పూర్తి స్దాయిలో విజయం సాధించారు. ఇంద్రవెల్లి సభ మొదలుకొని మహబూనగర్ బహిరంగ సభ వరకూ రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు నీరాజనాలు పలికారు. ప్రధానంగా గజ్వేల్ రైతు భరోసా సభలో కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనాలు కేరింతలు కొట్టారు. ప్రతి సభలో కేసీఆర్ మీద అణుబాంబులా రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి ఆత్మ విశ్వాసానికి తెలంగాణ ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఊహించని విజయాన్ని అందిచారు తెలంగాణ ప్రజలు.

ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చడం ఓ సాహసం.!
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతిభవన్ ఇనుపకంచెను తొలగించి, ప్రగతిభవన్ పేరును జ్యోతీరావుపూలే ప్రజాభవన్ గా మార్చడంతో సీఎం ఎంత సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారో, ఎంత డైనమిక్ గా పరిపాలన అందిస్తారో తెలంగాణ ప్రజానికానికి చెప్పకనే చెప్పినట్టయ్యింది. ప్రజాభవన్ లో ప్రజావాణి నిర్వహించిన సీఎంకు ఎంత గొప్ప మనసుందో, ఆ మనసువెనక ఎంత మానవత్వం ఉందో అనే చర్చ కూడా చోటుచేసుకుంది. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన విజ్ఞప్తులను జవాబుదారీ తనంతో పరిష్కరించే విధంగా అధికారులను మోటివేట్ చేయడంలో సీఎం విజయం సాధించారు. అందుకే ప్రజావాణి కార్యక్రమం ఇప్పటికి కూడా అప్రతిహతంగా ముందుకు వెళ్తోంది.
ఆరు గ్యారెంటీల అమలు ఓ అద్బుతం.!
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల ప్రకటన కూడా కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసొచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత పథకం కింద 10లక్షల వరకు ఆరోగ్య భీమా, ఉచిత గ్యాస్, 200వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ఉద్యోగావకాశాల కల్పన, ధరణి పోర్టల్ రద్దు వంటి కార్యక్రమాలు తెలంగాణలో అద్బుత ఫలితాలనిచ్చాయి. బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న లక్షలాది మంది మహిళలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తడం సీఎం రేవంత్ రెడ్డి పనితీరుకు అద్దం పడుతున్నట్టు చర్చ జరుగుతోంది. సహజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమపథకాల రూపకల్పన ఏ ఇతర పార్టీలకు కూడా సాద్యం కాదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పథకాలను ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీకే సాద్యపడుతుందని పథకాల లబ్దిదారులు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.
రైతు సంక్షేమ ప్రభుత్వానికి ఇంతకన్నా నిదర్శనం ఏంకావాలి.?
ప్రజా ప్రభుత్వం రైతు రాజ్యంలో ప్రజా సంక్షేమం కోసం కట్టుబడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారి కోసం విడుదల చేసిన నిధుల వివరాలు ఒకసారి చూస్తే రాష్ట్ర రైతాంగం పట్ల ప్రభుత్వం అంకితభావం అవగతమవుతుంది. రుణమాఫీ : ₹ 18,000 కోట్లు, రైతు భరోసా : ₹ 7,625 కోట్లు, రైతుబీమా : ₹ 1,455 కోట్లు,పంటలబీమా : ₹ 1,300 కోట్లు, ఉచితవిద్యుత్ : ₹10,444 కోట్లు, సన్న వడ్ల బోనస్ : ₹ 5,040 కోట్లు. లోటుబడ్జెట్ లో ఉన్న రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఒకే ఒక ఏడాదిలో అమలు చేసిన ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అనే చర్చ జరగుతోంది.

రేవంత్ రెడ్డి విజయంతో నిరాశలో హేమాహేమీలు.!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత జరిగిన శాసనసభ సామావేశాలకు ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. ఎల్పీ నాయకుడుగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా శాసనసభకు రావడానికి విముఖత వ్యక్తం చేసారు. స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రశేఖర్ రావు మళ్లీ అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు. ఈ క్రెడిబిలిటీ అంతా సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రశేఖర్ రావులో ఓ రకమైన భయాన్ని, అభద్రతాభావాన్ని తీసుకురావడంలో విజయం సాధించారు. 2023డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే చంద్రశేఖర్ రావు ప్రమాదవశాత్తూ పడిపోవడం, తొంటి ఎముక విరిగి ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్ప తీసుకోవడం, బెడ్ మీద ఉన్న చంద్రశేఖర్ రావును సీఎం హోదాలో రేవంత్ రెడ్డి పరామర్శించడానికి వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలుగా మిగిలిపోయాయి.
శాసనసభలో రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టే కుటిల యత్నం.!
శాసనసభలో రేవంత్ సర్కార్ ను ఇరకున పెట్టేందుకు మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ సభా నాయకుడిగా రేవంత్ రెడ్డి వారి వ్యూహాలను సమర్ధవంతంగా తిప్పికొట్టారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సీఎంగా చంద్రశేఖర్ రావు చేసిన దుబారా, విచ్చలవిడిని ప్రజలముందుంచారు సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, ధరణిలో జరుగుతున్న తప్పులు, అధికార పార్టీ నేతల భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, పబ్బులు, గంజాయి, డ్రగ్స్ తదితర అంశాలపై రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రశేఖర్ రావుతో సహా సభలో అడుగుపెట్టిన కీలక నాయకులందరికి రేవంత్ రెడ్డి తనదైన రీతిలో సమాధానం చెప్పడంతో బీఆర్ఎస్ నేతలు వెనక్కి తగ్గక తప్పలేదు.

మూసీ పునరుజ్జీవ పథకం ఓ బృహత్కర కార్యం.!
ఇక తెలంగాణలో చెరువు ప్రాంతాలను పరిరక్షించే క్రమంలో హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలను తొలంగించారు అధికారులు. ఇందుకోసం ఓ పటిష్టమైన వ్యవస్ధను రూపొందించారు రేవంత్ రెడ్డి. నిబద్దతతో పనిచేసే ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను హైడ్రా కమీషనర్ గా నియమించారు సీఎం. దీంతో నగరంలోని చెరువు ప్రాంతాల్లో పర్యటించిన రివెన్యూ అధికారులు చాలా వరకు అక్రమనిర్మాణాలను తొలగించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల నిరుపేదలు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఇళ్లు రోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూంలు ఇచ్చి మానవత్వం చాటుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రేవంత్ రెడ్డి విధానాలను తప్పు బట్టే ప్రయత్నం చేసారు. ఆ తర్వాత మూసీ పునరుజ్జీవ పథకాన్ని కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యతిరేకించే ప్రయత్నం చేసాయి. బీజేపీ ఓ అడుగు ముందుకేసీ మూసీ నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి దుర్గంధం లేదని, దోమల బెడద లేదని చెప్పే ప్రయత్నం చేసి అబాసుపాలయ్యారు బీజేపి నేతలు.
సాహసోపేత సీఎంకు ఆకాశమే హద్దు.!
తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపించారు. తన జన్మదినం రోజున ఏ ఫైవ్ స్లార్ హోటల్లోనో కేకులు కట్ చేస్తూ, బోకేలందుకుంటూ కాలక్షేపం చేయకుండా యాదగిరి గుట్టలో దేవుడి ఆశిర్వాదం తీసుకుని నేరుగా మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదో బృహత్కర నిర్ణయంగా తెలంగాణ ప్రజానికంలో చర్చ జరిగింది. మూసీ అంశంలో ఎన్నో విమర్శలు గుప్పిస్తున్న బీఆర్ఎస్, బీజేపి వైఖరికి సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనకడువేయలేదు. మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని ఘంటాపథంగా చెప్పడం పట్ల సీఎం ఎంత స్పష్టంగా ఉన్నారనే సంకేతాలు పంపించారు. దీంతో రేవంత్ రెడ్డి విధానాలు తెలంగాణ ప్రజలకు మరింత దగ్గరైనట్టు చర్చ జరుగుతోంది.
-
తెలంగాణలో ఆరోగ్య విప్లవం:పేదలకు కార్పొరేట్ వైద్యం-సీఎం రేవంత్ భారీ హెల్త్ ప్లాన్..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications