సుహాసిని కోసం క‌దులుతున్న ప‌రిశ్ర‌మ‌..! మద్దతు తెలుపుతున్న సినీ తార‌లు..!!

హైద‌రాబాద్ : సినీ ప‌రిశ్ర‌మ క‌దులుతోంది. ప్ర‌క్రుతి విప‌త్తుల‌ప్పుడు క‌దిలే సినిప‌రిశ్ర‌మలో మ‌ళ్లీ ఇప్పుడు క‌ద‌లిక వ‌చ్చింది. తెలంగ‌ణ ఎన్నిక‌ల సంద‌ర్బంగా కూక‌ట్ ప‌ల్లి నుంచి పోటీ చేస్తున్న నంద‌మూరి సుహాసిని కి మ‌ద్ద‌త్తుగా తెలుగు ప‌రిశ్ర‌మ స్పందించ‌బోతోంది. ఇప్ప‌టికే న‌టుడు జ‌గ‌ప‌తి బాబు, స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ, దివ్య‌వాణి సుహాసినికి మ‌ద్ద‌త్తు తెల‌ప‌గా మ‌రికొంత మంది సంఘీభావం తెలిపేంద‌కు రెఢీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో కూక‌ట్ ప‌ల్లి ప్ర‌చారంలో సినిమా తార‌ల తాకిడి ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

సుహాసినికి అండ‌గా సినీ ప‌రిశ్ర‌మ‌..! మ‌ద్ద‌త్తు తెలుపుతున్న తార‌లు..!!

సుహాసినికి అండ‌గా సినీ ప‌రిశ్ర‌మ‌..! మ‌ద్ద‌త్తు తెలుపుతున్న తార‌లు..!!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యంత కీలకమైన స్థానాల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం ఒకటి. ఇక్కడ సెటిలర్లు ఎక్కువగా ఉండడం వల్ల అన్ని పార్టీల దృష్టి దీనిపై పడింది. మిగిలిన పార్టీలతో పోలిస్తే ఈ స్థానంపై తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఇది ఆ పార్టీకి సిట్టింగ్ స్థానం. గత ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 43 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మహాకూటమి పొత్తులో భాగంగా ఇప్పుడు కూకట్‌పల్లి ఆ పార్టీకే దక్కింది. అందుకే ఈసారి కూడా ఇక్కడ పాగా వేయాలని టీడీపీ అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తోంది.

జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌సుధ ఓకే..! మ‌రికొంత మంది సంఘీభావం తెలిపేందుకు సై..!!

జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌సుధ ఓకే..! మ‌రికొంత మంది సంఘీభావం తెలిపేందుకు సై..!!

ఇందులో భాగంగానే ఇక్కడి నుంచి దివంగత నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి టికెట్ కేటాయించింది ఆ పార్టీ అధిష్ఠానం. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు సుహాసిని కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టిన ఆమె.. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సెటిలర్లు ఎక్కువగా ఉండడంతో పాటు, టీడీపీ సిట్టింగ్ స్థానం కావడంతో ఆమె విజయంపై మహాకూటమి ధీమాగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో సుహాసినికి ఊహించని వ్యక్తి నుంచి మద్దతు లభించింది. దీంతో టీడీపీ శ్రేణులు ఆనందపడుతున్నాయి.

 సుహాసిని గెలుపును కాంక్షిస్తున్న తార‌లు..! ప్ర‌చారం చేయ‌నున్న న‌టీన‌టులు..!

సుహాసిని గెలుపును కాంక్షిస్తున్న తార‌లు..! ప్ర‌చారం చేయ‌నున్న న‌టీన‌టులు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కప్పుడు హీరోగా వెలుగు వెలిగి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న జగపతిబాబు.. నందమూరి సుహాసినికి మద్దతు తెలిపారు. ఆమెకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ‘‘మన కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శ్రీమతి నందమూరి సుహాసిని గారికి నా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను. శ్రీమతి సుహాసిని పరిపూర్ణ వ్యక్తిత్వం గల నాయకురాలు. నీతి నిజాయితీలతో ఆమె ప్రజా సేవ చేయగలరని నాకు నమ్మకముంది'' అని జగ్గూ భాయ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇది చూసిన టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది.

రంగంలోకి బాల‌క్రిష్ణ‌...! జూనియ‌ర్ ఎంటీఆర్ కూడా వ‌చ్చే అవ‌కాశం..!!

రంగంలోకి బాల‌క్రిష్ణ‌...! జూనియ‌ర్ ఎంటీఆర్ కూడా వ‌చ్చే అవ‌కాశం..!!

వాస్తవానికి నందమూరి కుటుంబంతో మంచి సంబంధం కలిగి ఉన్న జగపతిబాబు.. ఇదే విషయాన్ని పదే పదే బహిరంగంగానే చెప్పుకున్నారు. నందమూరి బాలకృష్ణ-జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాల సమయంలోనూ వారిని కలిపేందుకు ఆయన చాలా ప్రయత్నాలే జరిపారని వార్తలు వచ్చాయి. ఇటీవల జరిగిన ‘అరవింద సమేత.. వీరరాఘవ' సక్సెస్‌ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అందరికీ గుర్తుండే ఉంటాయి. అయితే, జగపతిబాబు మద్దతును ప్రకటించడంతోనే ఆపేస్తారా..? లేక సుహాసిని తరపున ప్రచారం కూడా నిర్వహిస్తారా అనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+