ఇస్లామిక్ స్టేట్‌కు ప్రభావితమయ్యా, యువతను ఆకర్షించా: నికీ జోసెఫ్
హైదరాబాద్ : తాను ఐఎస్ఎస్‌కు తీవ్రంగా ప్రభావితమైనట్లు నిక్కీ జోసెఫ్ అలియాస్ అప్సా జబీన్ చెప్పింది. ఐఎస్‌ఐఎస్ ప్రచారకర్త అఫ్సా జబీన్(37) అలియాస్ నిక్కీ జోసెఫ్‌ను శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే.
సోమవారంనాడు తన నేరాంగీకార వాంగ్మూలంలో ఆమె కీలక అంశాలు వెల్లడి అయ్యాయి. ఐఎస్‌ఐఎస్ కార్యకలాపాల పట్ల తీవ్రంగా ప్రభావితమయ్యానని అఫ్సా తెలిపారు. సున్నీలు, షరియత్ చట్టం కోసం పోరాడుతున్న ఐసీస్‌కు తాను మద్ధతురాలిగా నిలిచినట్లు చెప్పింది. మొహియుద్దీన్ అనే వ్యక్తితో కలిసి 2010లో ఫేస్‌బుక్ గ్రూప్ ఏర్పాటు చేశామని చెప్పారు.

ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారా యువత ఐసీస్‌లో చేరేలా ప్రేరేపించామని తెలిపారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్ గ్రూప్‌ను 50 వేల మంది అనుసరించారు. ఐసీస్ వీడియోలు పోస్టు చేసి భారత యువతను రెచ్చగొట్టామని స్పష్టం చేశారు. ఐసీస్ అంశాలు పోస్టు చేయడంతో తమ గ్రూప్‌ను ఫేస్‌బుక్ తొలగించిందని తెలిపారు. ఫేస్‌బుక్‌లో మరో 4 గ్రూప్‌లు ఏర్పాటు చేశాం. మొహియుద్దీన్ అరెస్టు కాగానే ఫేస్‌బుక్, మెయిల్ ఐడీ తొలగించామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications