మొన్న స్వాతి, నిన్న రోషన్‌కుమార్: ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్: తమిళనాడు రాజధాని నుంగంబాకం రైల్వే స్టేష‌న్‌లో రైలు కోసం ఎదురుచూస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యే కేసును పోలీసులు చేధించక ముందే హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ సంస్ధకు చెందిన మరో ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ముందేచెప్పిన ఇన్ఫోసిస్ టెక్కీ: హైద్రాబాద్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇది!

వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లాలోని ఘట్‌కేసర్ సమీపంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన రోషన్‌కుమార్(27) స్థానిక సంస్కృతి టౌన్‌షిప్‌లోని ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. సంస్కృతి టౌన్‌షిప్‌కు సమీపంలో ఉన్న పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

Infosys employee commits suicide in rangareddy district

అయితే మంగళవారం రాత్రి తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం దీనిని గమనించిన వాచ్‌మెన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య: కీలక ధారం లభ్యం!

ఆత్మహత్య చేసుకున్న రోషన్‌కుమార్ గదిని పోలీసులు పరిశీలించగా 'తన మృతికి ఎవరూ కారణం కాదు' అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ ప్రకాశ్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+