'కేసీఆర్ ఉంటే హరీష్, కవిత, కేటీఆర్ జైలుకెళ్తారు!'

హైదరాబాద్: తిరగబడిన ఉద్యమాలు నేర్పిన తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు టక్కుటమార విద్యలు ఏమీ చేయలేవని తెలంగాణ ఉద్యమ నేత గాదె ఇన్నయ శనివారం అన్నారు.

2019 దాకా కేసీఆర్‌ బతికుండి పాలన కొనసాగితే 2019 జూన్‌ 5వ తేదీన దుష్టచతుష్టయమైన హరీశ్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కవిత ఆమె భర్త అనిల్‌ జైలుకు పోవడం ఖాయమని చెప్పారు.

'తెలంగాణ రాష్ట్రం- 360 రోజులు- 360 డిగ్రీలు తెలంగాణ రణం, సంస్మరణం తొలిదశ (1969), మలిదశ(1994) ఉద్యమం వైతాళికులకు వందనం' పేరిట తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇన్నయ్య మాట్లాడారు. కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలని సవాల్‌ విసిరారు.

 Innaiah challenges KCR

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉపాధ్యాయులను కేసీఆర్ విస్మరించారని, తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ రెడ్డి విమర్శించారు.

పలుమార్లు విన్నవించినా, ఉపాధ్యాయుల సమస్యల్లో ఒక్కదానిని కూడా ఆయన పరిష్కరించలేదన్నారు. వారిని అణిచివేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. తెరాస ఏడాది పాలనలో ఉపాధ్యాయులకు ఒరిగిందేమీ లేద్నారు. సేవా నిబంధనలు, బదలీలు, పదోన్నతులతో పాటు ఇతర సమస్యలు, పీఆఱ్సీ బకాయిల చెల్లింపు వంటివి అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+