Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఖాకీ కీచకం : కట్టుకున్న భార్యకు వేధింపులు, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

హైదరాబాద్ : అతనో పోలీస్. మంచి పోజిషన్‌లో ఉన్నాడు. బంగారం లాంటి భార్య కూడా ఉంది. అయితే బుద్ధి మాత్రం పక్క చూపులు చూసింది. ఇంకేముంది ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో సంసారం బజారున పడింది. తన భర్త వేధింపులపై ఆ అతివ చివరికి పోలీసులను ఆశ్రయించింది. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన పోలీసుశాఖలో చర్చకు దారితీసింది. శ్రీనివాస్‌పై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతుంది.

17వ బెటాలియన్ రిజ్వర్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్‌ మంచి హోదాలో ఉన్నాడు. పనిచేసుకుంటూ బుద్దిగా ఉండాలి .. కానీ చెడుతోవ పట్టాడు. ఇంట్లో ఉన్న భార్యను వేధించాడు. హరాస్ మెంట్‌కు కారణం ఏంటా అని ఆయన భార్య ఆరాతీస్తే వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. దీంతో ఆమె లక్షెట్టిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని .. తనను వేధిస్తున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

inspector srinivas harassed his wife

వివాహేతర సంబంధంపై ప్రశ్నించింది అవంతిక. దీంతో శ్రీనివాస్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. సూటి పోట మాటలతో వేధించాడు. తననే కాకుండా కుటుంబసభ్యులును, బంధువులను కూడా బెదరిస్తున్నాడని వాపోయింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాదు శ్రీనివాస్‌తో తనకు ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణలు చేసింది. భర్త నుంచి తనకు భద్రత కల్పించాలని పోలీసులను వేడుకున్నది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+