అబ్బో.. ఏం తెలివి! రేప్ చేయబోతుంటే ఒక్క మాట చెప్పింది అంతే.. పరార్!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: అత్యాచారానికి గురవ్వబోతున్న ఓ మహిళ తెలివిగా ఆలోచించి, దుండగుల నుంచి తప్పించుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన ఉదంతమిది. ఆమె చెప్పిన మాట వినగానే అత్యాచారానికి పూనుకున్న వాళ్లు పరుగో పరుగు. ఇంతకీ ఏం చెప్పిందంటే...

న్యూయార్క్ నగరంలో ఓ మహిళ(50) ప్రార్థన ముగించుకుని చర్చి నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గం మధ్యలో ఆమెను అనుసరించిన ఇద్దరు దుండగులు తుపాకీ చూపించి బెదిరించారు.

ఆమె వద్ద ఉన్న డబ్బులను దోచుకున్నారు. అంతటితో వదిలేయక.. మరో ముగ్గురు స్నేహితులను ఫోన్ చేసి పిలిపించారు. అత్యాచారం చేసేందుకు ఆమె దుస్తులను విప్పారు.

ప్రమాదం పసిగట్టినా ఏం చెయ్యాలో అర్థం కాని మహిళ.. తనకు హెచ్‌ఐవీ ఉందని అరవడం మొదలుపెట్టింది. ఆమె మాటలను నమ్మిన దుండగులు ఆమెను వదిలేసి పారిపోయారు.

బ్రతుకు జీవుడా అనుకుంటూ మళ్లీ చర్చికి పరిగెత్తిన ఆ మహిళ జరిగినదంతా అక్కడున్న ఫాదర్‌కు చెప్పింది. ఆయన పోలీసులకు ఫోన్ చేసి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించి, నిందితుల కోసం గాలింపు మొదలెట్టారు.

నిజమో, అబద్దమో.. మొత్తానికి .. తనకు ఎయిడ్స్ ఉందంటూ చెప్పి దుండగుల బారి నుండి తప్పించుకుందా మహిళ. మన ఆడోళ్లకి కనీసం ఇంత తెలివి ఉన్నా బాగుణ్ణు. ఎన్నో అత్యాచారాలు జరగకుండానే ఆగిపోతాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A new york woman very cleverly escaped from the rapists by telling something. After hearing the words said by the woman.. the rapists ran away. Do You think what could be the words said by her. The woman whose age is 50 is coming from the church after finishing her prayer. Two persons followed her and threatened her by showing a pistol and looted her. After that they called their friends and when all are ready to rape her, she cleverly told them that she is a HIV positive.
Please Wait while comments are loading...