Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హీరోయిన్ తమన్నా ఫొటో పెట్టి, బాలిక పేరుతో చాటింగ్

ఖమ్మం: హీరోయిన్ తమన్నా ఫొటో పెట్టి బాలిక పేరుతో చాటింగ్ చేస్తున్న ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఉదంతం వెలుగు చూసింది. ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఓ బాలిక పేరుతో ఫేస్‌బుక్ ఖాతా తెరిచి, ఇతర ఖాతాదారులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతూ చాటింగ్ చేస్తున్న విషయం బయటపడింది.

ఆ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గండులగలపాడు గ్రామానికి చెందిన బొడ్డు నిఖిల్ అదే గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని పేరుతో ఫేస్‌బుక్ ఖాతా తెరిచాడు.

 Inter student chatting with girls name placing Tamannah image

ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ ఫొటోగా సినీ నటి తమన్నా ఫొటోను పెట్టాడు. దానిదవ్రా ఛాటింగ్ చేస్తున్నాడు. ఇతర మిత్రులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతున్నాడు. ఈ విషయం అతని స్నేహితులకు అర్థమైంది. వారు బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు.

పోలీసులు నిఖిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిఖిల్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసు స్టేషన్‌కు వచ్చారు. తమ ఎదుటే ఎస్సై శ్రీనివాస్ చేయి చేసుకున్నాడని ఆరోపిస్త్తూ పోలీసు స్టేషన్ ఎదుట వారు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+