Inter Exams: గూగుల్ మ్యాప్స్ వల్ల పరీక్ష రాయలేకపోయిన ఇంటర్ విద్యార్థి..
ఇంటర్ విద్యార్థి కొంప ముంచింది గూగుల్ మ్యాప్స్.
మనం తెలియని చోటికి ఎక్కడికి వెళ్లాలన్నాఏం చేస్తాం.. మొబైల్ లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాం. ముఖ్యంగా డెలివరీ బాయ్స్ ఈ గూగుల్ మ్యాప్స్ ఆధారంగానే డెలివరీలు చేస్తారు. అయితే ఒక్కోసారి గూగుల్ మ్యామ్స్ రాంగ్ ప్లేస్ కు తీసుకెళ్తుంది. సాధారణ పరిస్థితుల్లో అలా అయితే ఫర్వాలేదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో గూగుల్ మ్యాప్స్ తప్పుదోవ పట్టిస్తే ఎలా ఉంటుంది.
గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకుని ఓ ఇంటర్ విద్యార్థి పరీక్ష రాయలేకపోయాడు. హాల్ టికెట్ లో ఉన్న పరీక్ష కేంద్రం అడ్రస్ ను అతను తన ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ టైప్ చేసి బయల్దేరాడు. కానీ గూగుల్ మ్యాప్స్ అతన్ని తప్పుడు చిరునామాకు తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లేసారికి ఎగ్జామ్ సెంటర్ లేదు. ఆ విద్యార్థి స్థానికుల సాయంతో సరైన ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లాడు. కానీ అప్పటికే ఆలస్యం అవడంతో అతన్ని అధికారులు పరీక్ష రాయడానికి అనుమతించలేదు.

ఎంతా బతిమిలాడినా పరీక్ష కేంద్రం వారు పరీక్ష రాయడానికి ఒప్పుకోలేదు. దీంతో అతను పరీక్ష కేంద్రం నుంచి ఇంటిముఖం పట్టాడు.ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన వినయ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. అతను గూగుల్ మ్యాప్స్ ఉంది కదా అనే భరోసాతో బయల్దేరాడు.
గూగుల్ మ్యాప్స్ చూపించిన డైరెక్షన్ ప్రకారం వెళ్లాడు. కానీ అతను రాంగ్ లోకేషన్ కు వెళ్లాడు. దీంతో అతను స్థానికులను అడ్రస్ అడుకుంటూ వెళ్లాడు. చివరికి పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. కానీ అప్పటికే పరీక్ష ప్రారంభమై 27 నిమిషాలు అయింది. దీంతో అతను పరీక్ష రాయలేకపోయాడు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎవరైనా పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకుంటే మంచిదని అధికారులు చెబుతున్నారు. ముందుగా బయల్దేరితే ఎలాంటి సమస్యలు రావన్నారు.












Click it and Unblock the Notifications