ఆసక్తికరం:'అన్నా మంత్రి పదవి కోసం బాధ పెట్టుకొన్నావా'? 'మా పార్టీలోకి ఎప్పుడొస్తున్నావు'?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకొంది. మంత్రి పదవి విషయమై వీరిద్దరి మధ్య ఈ సంభాషణ జరిగింది.

అసెంబ్లీ లాబీల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పలుకరించారు. శ్రీనన్నా.. మంత్రి పదవి రాలేదని రంది పెట్టుకున్నవా..? ఉద్యమ సమయంలో మీరు, స్వామిగౌడ్‌ లాఠీ దెబ్బలు తిన్నారు కదా. మీకు మంత్రి పదవి వస్తే బాగుండేదన్నా..అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Interesting conversation between Congress mla komatireddy venkatreddy Trs mla Srinivas goud

దీనిపై అదేం లేదన్నా.. మంత్రి పదవి వచ్చే టైమ్‌లో వస్తుంది.. అయినా మా ప్రభుత్వం వచ్చింది కదా? సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారు కదా అని టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు.

ఉద్యమం చేసిన తలసాని, తుమ్మలకు మంత్రి పదవులు వచ్చాయి కదా అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే దీనిపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ స్పందించలేదు.

ఇదంతా ఎందుకు? మీరెప్పుడు మా పార్టీలోకి వస్తున్నరో చెప్పండని శ్రీనివాస్‌ గౌడ్‌ ఎదురు ప్రశ్నవేశారు. ఎక్కడికీ రాను. తెలంగాణ వచ్చింది అదే సంతోషం. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్నా అని కోమటిరెడ్డి గుర్తు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Interesting conversation between Trs MLA Srinivas goud and Congress MLA Komatireddy venkat Reddy at Assembly lobby on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి