వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ష్యూరిటీ' పేరుతో పిలిపించి రేప్: టీవి నటి కేసులో అసలు నిజాలివి!..

తాను చెప్పినట్లు అనంతపురం రాకపోతే.. వాటిని సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బెదిరింపులకు తలొగ్గి ఆమె అనంతపురం వెళ్లడంతో..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎల్బీనగర్ పరిధిలో నివాసముంటున్న రూప అనే ఓ టీవి నటిపై.. అదే ప్రాంతానికి చెందిన గిరీశ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. రూప రహస్య వీడియోలు, ఫోటోల ద్వారా ఆమెను బెదిరించి లోబరుచుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. రూప ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగడంతో మరిన్ని విషయాలు వెలుగుచూశాయి.

పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం తాడిపత్రికి చెందిన కొమర్‌శెట్టి గిరీష్‌(27) అక్కడే శ్రీవిద్యాదుర్గ మెడికల్‌దుకాణం నిర్వహిస్తున్నాడు. ఎల్బీనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే రూప అనే టీవి నటితో ఓ స్నేహితుడి ద్వారా అతనికి పరిచయం ఏర్పడింది. గతేడాది నవంబర్ లో వీరి మధ్య పరిచయం ఏర్పడగా.. రూప అవసరార్థం ఇటీవల అతను రూ.1లక్ష అప్పు ఇచ్చాడు.

<strong>టీవీ నటి కిడ్నాప్, ఆపై అత్యాచారం.. అనంతపురంలో కీచకుడి అరెస్టు!</strong>టీవీ నటి కిడ్నాప్, ఆపై అత్యాచారం.. అనంతపురంలో కీచకుడి అరెస్టు!

interesting facts in tv actress rupa rape case

ఈ అప్పుకు సంబంధించి.. ష్యూరిటీ పేపర్స్ పై సంతకాలు చేయాలని చెప్పి రూపను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడికెళ్లాక.. కూల్ డ్రింక్ లో నిద్రమాత్రలు కలిపి ఆమె చేత తాగించాడు. ఆపై ఆమె స్పృహ కోల్పోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే స్థితిలో ఆమె ఫోటోలు చిత్రీకరించి.. అప్పటినుంచి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.

తాను చెప్పినట్లు అనంతపురం రాకపోతే.. వాటిని సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బెదిరింపులకు తలొగ్గి ఆమె అనంతపురం వెళ్లడంతో.. కల్యాణదుర్గంలోని ఓ ఇంట్లో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు, రూప మెడలోని బంగారు గొలుసును లాక్కుని.. దాన్ని బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.1.1లక్ష నగదు రుణంగా తీసుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఇక అతని వేధింపులు భరించలేక రూప.. అక్కడినుంచి తప్పించుకుని ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను రిమాండ్‌లో ఉన్నాడు.

English summary
These are the interesting facts revealed by LB Nagar police regarding TV actress Rupa case. On wendesday police arrested accused Girish who was raped her
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X