సోషల్ మీడియాలో ఇంటర్ ప్రశ్నాపత్రాలు, పొలిటికల్ లీడర్ హస్తం!?
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ మేథ్స్ పరీక్షా పత్రం లీక్ అయినట్లుగా బుధవారం జోరుగా వార్తలు వస్తున్నాయి. నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, భువనగిరి, నల్గొండ, మిర్యాలగూడలలో ఈ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇంటర్మీడియేట్ మేథ్స్ సెకండియర్ పరీక్ష బుధవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరిగింది. పరీక్ష ప్రారంభమైన అరగంటకే.. ప్రశ్నా పత్రం లీక్ అయినట్లుగా జోరుగా వార్తలు వచ్చాయి.
ప్రయివేటు యాజమాన్యాలకు తలొగ్గి ప్రశ్నాపత్రం లీక్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, కేవలం ర్యాంకుల కోసం పిల్లల భవిష్యత్తుతో ప్రయివేటు యాజమాన్యాలు ఆడుకుంటున్నాయని ఆరోపిస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ ప్రశ్నాపత్రం లీక్‌లో ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications