సోషల్ మీడియా వద్దని తల్లి మందలింపు: కేబుల్ బ్రిడ్జిపైనుంచి దూకేసిన ఇంటర్ విద్యార్థిని
హైదరాబాద్: తల్లి మందలించిందనే కారణంతో ఓ ఇంటర్ విద్యార్థిని దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను లేక్ పోలీసులు కాపాడారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ ఉంటున్న ఓ బాలిక ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే, సోషల్ మీడియాలో చాటింగ్ విషయమై తల్లి మందలించింది.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం 7.30 సమయంలో కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరింది. అయితే, ఆమె తరగతులకు రాలేదని కాలేజీ నుంచి సమాచారం రావడంతో తల్లి తనకు తెలిసిన చోట్ల గాలించింది. ఆ తర్వాత కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలింపు చేపట్టారు.

ఆ విద్యార్థిని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేసిన పోలీసులు.. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో దుర్గం చెరువు దగ్గర ఉన్నట్లు గుర్తించారు. వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన లేక పోలీసులు, ఐటీ మొబైల్ సిబ్బంది దుర్గం చెరువు వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో కేబుల్ బ్రిడ్జి మీద నుంచి చెరువులోకి దూకిన బాలికను గమనించిన పోలీసులు.. బోటింగ్ సిబ్బంది సహాయంతో రక్షించారు.
వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించిన లేక్ పోలీస్ కానిస్టేబుళ్లు శ్రీశైలం, నవీన్, ఐటీ మొబైల్ స్టాఫ్ రెహ్మత్ అలీ, కృష్ణయ్యను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. తమ కూతురును కాపాడినందుకు బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇటీవల కాలంలో కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications